నారా చంద్రబాబు నాయుడు అంటే, అది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అమెరికా నుంచి అనకపల్లి వరకు, బిల్ క్లింటన్ దగ్గర నుంచి, మన దేశంలో చిన్న స్థాయి నేత వరకు, ఆయన పరిపాలనా విధానానికి ఫిదా అయిన వారే. ఆయన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించిన చరిత్ర ఉన్నోడు. ఆయన కేంద్ర ప్రభుత్వాలను శాసించినోడు. ఆయన రాష్ట్రపతిలు, ప్రధానులను నియమించిన వాడు. అలాంటి చరిత్ర ఉన్న మహా నేతను, కేవలం ఎన్నికల్లో ఒక్కసారి ఓడిపోయాడని హేళన చేస్తున్నారు. సరే ఇవి రాజకీయాల్లో సహజం అని, ఆయన అన్నీ భరిస్తూ ముందుకు వెళ్తుంటే, ఇప్పుడు ఆ హేళనలు, బూతులు అయ్యాయి, బూతులు ఆడవాళ్ళ వరకూ వచ్చాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, ద్వారంపూడి, రోజా, వీళ్ళా చంద్రబాబుని అనేది ? వీరికా ఆయన్ను అనే చరిత్ర ఉంది ? అయితే చంద్రబాబు భార్యని లాగటం, బూతులతో ఆవిడ క్యారక్టర్ మీద దెబ్బ కొట్టటం, ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చలించిన చంద్రబాబు, తన భార్యను బజారులో పెడితే ఇప్పుడు కన్నీళ్లు పట్టుకోవటం, ఇవన్నీ చూసాం. సరే అయ్యింది ఏదో అయిపొయింది, ఇప్పటికైనా క్షమాపణ చెప్పారా అంటే అదీ లేదు. సిగ్గు లేకుండా ఎదురు దాడి చేస్తూ, అందరి చేత ఆయన్ను తిట్టిస్తున్నారు.

jagan 2112021 2

ఇప్పుడు ఈ విషయం పెద్దది అయ్యింది. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కావటంతో, అయన్ను వివిధ రాష్ట్రాల నేతలు పరామర్శిస్తున్నారు. అయితే ఈ విషయం పెద్దది అవ్వటం, జాతీయ మీడియా కూడా జగన్ మోహన్ రెడ్డి పార్టీని విమర్శలు చేస్తూ కధనాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు దీనికి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో వైసీపీ పడింది. రేపు సోమవారం అసెంబ్లీ సమావేశం దీనికి వేదిక అయ్యింది. అసెంబ్లీలోనే ఆ వ్యూహం రెడీ చేసారు. స్పీకర్ ఎలాగూ స్పందిస్తారు కాబట్టి, ఆయన స్పందించిన తరువాత, వైసీపీలో రోజా లాంటి నాయకులతో మాట్లాడించి, తరువాత జగన్ అందుకుని, చంద్రబాబు నా తల్లిని అన్నాడు, నా చెల్లిని అన్నాడు, ఇలా అన్నీ చెప్పి, చివరకు మేమే ఏమి చేయకపోయినా చంద్రబాబు హార్ట్ అయ్యారు కాబట్టి, తెలిసో తెలియకో ఏదైనా అంటే, ఆ మాటలు వెనక్కు తీసుకుంటున్నాం అని చెప్పి, భువనేశ్వరి గారికి కూడా క్షమాపణ కాకపోయినా, అలా అర్ధం వచ్చేలా మాట్లాడి, ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, వైసీపీ వ్యూహం పన్నినట్టు తెలుస్తుంది. మరి ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిగా ఉండనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read