తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, ఏమైతే అరాచకాలు జరిగాయో, దాన్ని ఇంకొంతగా మెరుగులు దిద్ది, కుప్పంలో అమలు పరచటానికి, అన్ని వ్యూహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది అంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసారు. అయితే ఇప్పుడు అలా కాకుండా, ఫోర్ వీలర్స్ వాడాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మెన్లు, ఇలా రకరకాల హోదాలతో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన నామినేటడ్ పోస్టుల్లో ఉండే వారి కార్లలో, కుప్పంలో దొంగ ఓట్ల కోసం తరలించబోతున్నట్టు సమాచారం ఉంది అంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి. దీంతో పాటుగా, ప్రతి వార్డులోను 150 దొంగ ఓట్లు వేయటానికి, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కధనాలు వస్తున్నాయి. ఈ ప్రతి వార్డులో 150 దొంగ ఓట్ల కోసం ముందు నుంచే కసరత్తు చేసారు. కొత్తగా ప్రతి వాడులో 150 దొంగ ఓట్లు నమోదు అయినట్టు తెలుస్తుంది. వీరిని ఎలా ఓటు వేయించాలి అనే దాని పై పక్కాగా స్కెచ్ వేసారు. ఒకటి అక్కడ కుప్పంలో ఉండే ఖాళీ ఇళ్ళను ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. కేవలం 5 రోజుల కోసం రూ.20 వేల వరకు అద్దెలు చెల్లించి, ఈ దొంగ ఓట్ల కోసం బయట నుంచి వచ్చిన జనాలను ఇక్కడ దింపినట్టు తెలుస్తుంది.

kuppam 13112021 2

ఎక్కడ ఖాళీ ఇళ్లు ఉన్నా, ఈ దొంగ ఓటర్లను ఇక్కడ డంప్ చేసారు. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలను ఇక్కడ ప్రచారం చేసుకోనివ్వని పోలీసులు, ఇక్కడ మాత్రం ఇలాంటి వారిని పట్టించుకోవటం లేదు. ఇక రెండో వ్యూహంగా కుప్పంలో ఉన్న వైసిపీ వారే, రెండు మూడు ఓట్లు వేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఉదయమే వచ్చి దొంగ ఓట్లు, తరువాత వచ్చి తమ సొంత ఓటు వేసే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు ఆ కధనం చెప్తుంది. మొత్తం మూడు అంచెల్లో ఈ దొంగ ఓట్లు వేయటానికి ప్లాన్ చేసారు. ఎలాగైనా 3 నుంచి 5 వేల వరకు దొంగ ఓట్లు వెయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే టిడిపి క్యాడర్ చాలా పటిష్టంగా ఈ వ్యవహారాలు అన్నీ గమనిస్తున్నారు. టిడిపి క్యాడర్ కు దొరక్కుండా చూడాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క టిడిపి నేతలు, ఈ వ్యూహాన్ని భగ్నం చేయటానికి టిడిపి కూడా సన్నద్ధం అయ్యింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అనుభవంతో, టిడిపి కూడా కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది. అయితే పోలీసులు, అధికారులు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read