వైఎస్ వివేకనందరెడ్డి ఏపిలో ఒక సంచలనం. అత్యంత క్రురంగా చం-ప-బ-డ్డా-రు. 2019 ఎన్నికల సమయంలో జరిగిన ఈ దారుణం గురించి, అప్పట్లో సిబిఐకి ఇవ్వాలి అని గగ్గోలు పెట్టిన జగన్ గారు, తరువాత అధికారంలోకి వచ్చి సిబిఐ ఇవ్వద్దు అని పిటీషన్ విత్ డ్రా చేసుకున్నారు. చివరకు హైకోర్టు సిబిఐకి అప్ప చెప్పింది. మధ్యలో సిబిఐ విచారణ పైన, వైఎస్ వివేక కుమార్తె సునీత, నాకు న్యాయం జరగటం లేదని చెప్పిన విషయం కూడా చూసాం. అయితే ఇప్పుడు వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి బాంబు పేల్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో బడా బడా నేతలు బయట పడ్డాయి. అసలు మ-ర్డ-ర్ ఎందుకు చేసారు ? ఎంత ఖర్చు చేసారు ? ఎవరు ఉన్నారు ? ఎవరెవరు పాల్గున్నారు మొత్తం దస్తగిరి చెప్పేసాడు. ఆగస్ట్ 30న దస్తగిరి, కోర్టులో కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ని, కోర్టు ఈ రోజు మిగతా నిందితుల న్యాయవాదులకు ఇచ్చింది. దీంతో ఈ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇప్పుడు మీడియాకు వచ్చింది. ఈ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. వివేక హ-త్య జరిగిన తీరుని పూస గుచ్చినట్టు వివరించారు దస్తగిరి. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద, దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో ఈ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు దస్తగిరి.

viveka 13112021 21

వివేకను చం-పి-న వారిలో మొత్తం నలుగురు పాల్గున్నట్టు చెప్పారు దస్తగిరి. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకని చం-పి-న-ట్టు దస్తగిరి చెప్పారు. వివేక మ-ర్డ-ర్ ప్లాన్ మొత్తం, ఎర్ర గంగిరెడ్డి చేసారని చెప్పారు. బెంగుళూరులో జరిగిన ఒక ల్యాండ్ వివాదం వ్యవహారంలో తనకు వాటా ఇవ్వక పోవటంతో, వివేక పై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహం పెంచుకుని, కక్షతో రగిలిపోయే వాడని అన్నారు. ఇక 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తనను మోసం చేసారు అంటూ వైఎస్ వివేక, గంగిరెడ్డి, అవినాష్‌ రెడ్డిలకు వార్నింగ్ ఇస్తూ, వారి అంతు చూస్తానని చెప్పారని దస్తగిరి చెప్పారు. అవినాష్ ఇంటి దగ్గర ఇదే విషయం పై వివేక గొడవ కూడా పడ్డారని చెప్పారు. ఇక వివేక మ-ర్డ-ర్ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. దస్తగిరికి అయుదు కోట్లు ఇస్తాం అని చెప్పి, కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. ఇప్పుడు మొత్తం పెద్ద తలకయాల పేర్లు బయటకు రావటంతో, ఏమి జరగబోతుంది, సిబిఐ ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read