విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్తగా నిర్మించుకోవాల్సి రావడం రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించడం, ఇది చంద్రబాబు వర్క్ స్టైల్... ఏడాదిలో నాలుగు రోజులు మాత్రమే ఆయన కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లడంతో కొద్దిపాటి ఆటవిడుపు కలుగుతోంది.. ఈ సంవత్సరం కూడా, కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులు మాల్దీవుల పర్యటనకు వెళ్లారు... అక్కడ ఉన్నా, ఎప్పటికప్పుడు అక్కడ నుంచి టెలి కాన్ఫరెన్స్ లో, తగు సూచనలు ఇస్తున్నారు.. ఇవాళ రాత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటన ముగించుకుని వస్తున్న తరుణంలో, ఆయనకు మూడు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి..

cbn 22122017 2

ముందుగా పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి రివ్యూ చెయ్యనున్నారు... మొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య పోలవరం పై రివ్యూ చెయ్యటం, రేపటి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన వాయిదా పడటం, ఇవన్నీ సమీక్షంచి తగు సూచనలు చెయ్యనున్నారు... రెండోది, రాష్ట్ర బీజేపీ నాయకులు, ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి నాయకులు పెట్రేగిపోయి మాట్లాడుతున్న వ్యాఖ్యలతో, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించటం, ఇవన్నీ సమీక్షంచనున్నారు...కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం పంచుకుంటున్న భాగస్వామ్యపక్షం పొత్తులపై బహిరంగంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇద్దరికి మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది..

cbn 22122017 3

ఇక మూడో సమస్య సొంత పార్టీ నేతలు అనంతపురంలో చేస్తున్న రచ్చ... ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి , ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మేయర్ మధ్య విభేదాలు రోడ్డుకు ఎక్కి, సంకటంగా మారాయి. ఇప్పటికే చంద్రబాబు వీరికి అనేక వార్నింగ్ లు ఇచ్చారు... కాంగ్రెస్ నుంచి వచ్చిన సంప్రదాయం పార్టీలో కొనసాగడం అంత మంచిదికాదని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ఏం చేయాలన్నదానిపై చంద్రబాబు దృష్టి సారించే అవకాశం ఉంది... ఇక యధావిధిగా రేపటి నుంచి, పొద్దున్నే 6 గంటల నుంచి, రాత్రి 11 గంటల వరకు, ఆయన ఫ్లోలో పని అహర్నిశలు శ్రమించడం మొదలవుతుంది...

"ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్"... అన్ని కూడా ఉచితం, 16 నెలలు వెయ్యి రూపాయల బాట చెప్పులు అరిగేలాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగా............ఏమి ఉపయోగం లేదు!... పైగా నా సొంత జిల్లా, ఆ పైగా నూతన రాజధాని ప్రాంతం, ఆ ఆ పైగా ఏడుగురు శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు మొదలగు వారితో పరిచయం ఉన్నప్పటికీ..............వాళ్ల దగ్గరకు వెళ్లి సహాయం అడగటానికి ఎదవ అహం అడ్డం వచ్చింది, ఒక సామాన్యుడిలా ఈ సమస్యను ఎదుర్కొని చూద్దాం అప్పుడే కదా అసల ఈ ప్రభుత్వం పాలన తెలిసేది అని అలోచించి ఒక చిన్న పని చేశా.................... అదే "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" మనం 10 రోజులు అన్నం పెట్టి 11వ రోజు పెట్టకపోతే "ఇన్ని రోజులు ఎందుకు పెట్టావు? ఇప్పుడు ఎందుకు పెట్టను అంటున్నావు?" ఇలా ప్రశ్నించినప్పుడు మన ముఖం గోచిలో పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా? ఇన్ని సంవత్సరాలు మేతకి అలవాటు పడ్డ మన ప్రభుత్వ అధికారులది (అందరూ కాదు) ఇదే పరిస్థితి! "లంచం" "లంచం" "లంచం"

samanyudu 22122017 2

నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని, అమరావతి మండలం, నరకుళ్ళపాడు అనే గ్రామ పంచాయితి పరిధిలో పంచాయితి వారికి సంబంధించి నిరుపయోగంగా ఉన్న RO ప్లాంటును బాగుచేసి, ఆ గ్రామ ప్రజల త్రాగు నీటి అవసరాల నిమిత్తం దానిని ఉపయోగించుకునేలా తయారు చేసి ఇవ్వవలసినదిగా RWS&S డిపార్టుమెంటు అధికారులు మమ్ముల్ని ఆదేశించారు, మేము వారి ఆదేశాల మేరకు పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇచ్చాము....................ఇక సినిమాలో చూపించే విధంగా నాకు జరిగింది, ఆ శాఖ ఈ శాఖ అంటూ రెండు లక్షల రూపాయలకు పెద్ద పెద్ద కధలు చెప్పటం మొదలు పెట్టారు, నేను వినడం మొదలుపెట్టా, మధ్యలో ఖద్దరు బట్టలు తొడిగిన రాజకీయ నిరుద్యోగులు కూడా కలగచేసుకున్నారు అండోయ్...............ఇలా సంవత్సరం గడిచింది!

samanyudu 22122017 3

ఏమి చేయాలిరా భగవంతుడా అని అనుకుంటూ, నాతోపాటు రోజు ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే మరికొంత మంది పరిచయం అవ్వటంతో వారు కొనుక్కున్న శనక్కాయలు తింటూ ఆలోచిస్తూ ఉండగా మా గురువుగారు శ్రీ మొవ్వా వృషాద్రిపతి గారి తిట్టు ఒకటి బాగా గుర్తుకు వచ్చింది, అదే 'మూత్రవిసర్జన'. ఈ పదానికి నిజంగా అర్ధం తెలియచేయాలి అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నా. అప్పుడే పెట్టా "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" నేనే ఆశ్చర్య పోయేలా ఫలితాలు.............ఒక జిల్లా స్థాయి అధికారి ఫోన్ చేసి అప్పటివరకూ హరిన్ చంద్ అని పిలిచిన గొంతే హరిన్ చంద్ "గారు" అనడం మొదలు పెట్టింది............. 640 రోజులు పోరాటం చేసిన పూర్తి కాని పని కేవలం 20 రోజులలో అయిపోయింది. అదే "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" మహత్యం. అప్పుడు అర్ధమైంది ఈ చినబాబు ఆయన బాబు కన్నా పెద్దబాబు అవుతాడు అని, ఏమి సందేహం లేదు, ఇది నిజం, రాసుకోండి, గుర్తు పెట్టుకోండి! నాకు సహకరించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, పంచాయితీరాజ్ శాఖమాత్యులు శ్రీ నారా లోకేశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ............... ఒక సామాన్యుడు.

మంత్రి లోకేష్ ని హేళన చేస్తున్న వారికి మరో బ్యాడ్ న్యూస్... తన పని తాను చేసుకుపోతూ, తానూ ప్రాతిన్ధ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్‌ శాఖలో, దేశంలోనే టాప్ గా నిలిపి, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే టాప్ లో నిలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన
మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ లో అగ్ర భాగాన ఆంధ్రప్రదేశ్ నిలిచింది... గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ గ్రామాల్లో మౌలిక వసతులు, ఆర్థిక ప్రమాణాలు, పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలు, మహిళా సాధికారత తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు...

lokesh 22122017 3

ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో ఉన్న 41,617 గ్రామ పంచాయతీలు తమ వివరాలను మిషన్ అంత్యోదయ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసాయి. ఇప్పటి వరకూ ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం ఉత్తమ 83 గ్రామాలకు మిషన్ అంత్యోదయ ర్యాంకింగ్స్ ఇచ్చింది . మిషన్ అంత్యోదయ కేటాయించిన ఉత్తమ 83 గ్రామ పంచాయతీల్లో 33 స్థానాలు సాధించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 33 గ్రామాలు ఆగ్ర స్థానంలో నిలిచాయి. ఉత్తమ పది గ్రామ పంచాయతీల్లో 7 స్థానాలను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఇచ్చిన ర్యాంకింగ్స్ లో చిత్తూరు జిల్లా పరపట్ల గ్రామం 2వ స్థానం దక్కించుకుంది. విశాఖ జిల్లా చీడికాడ గ్రామానికి 3వ ర్యాంక్, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు, కృష్ణా జిల్లా ఉంగుటూరుకు, చిత్తూరు జిల్లా ఎగువ తవనంపల్లి కి 4వ ర్యాంక్, కృష్ణా జిల్లా ఇందుపల్లి కి 5వ ర్యాంకు, చిత్తూరు కలికిరి కి 6వ ర్యాంకు సాధించి అగ్ర స్థానంలో నిలిచాయి.

lokesh 22122017 2

నార్త్ ఇండియా కు చెందిన కేవలం 7 గ్రామాలు మాత్రమే ఉత్తమ 83 గ్రామాల లిస్ట్ లో స్థానం సంపాదించాయి. 33 గ్రామలతో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన, 21 గ్రామలతో తమిళనాడు, 6 గ్రామలతో కేరళ, 5 గ్రామలతో మహారాష్ట్ర, 4 గ్రామలతో తెలంగాణ ర్యాంకింగ్స్ వరుసలో ఉన్నాయి. మిషన్ అంత్యోదయ ప్రాధమికంగా సర్వే నిర్వహించి దేశ వ్యాప్తంగా 50 వేల గ్రామాలను ఉత్తమ పంచాయతీ ర్యాంకింగ్స్ కోసం ఎంపిక చేసింది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాలు 41,617 గ్రామాలకు సంబందించిన వివరాలు మిషన్ అంత్యోదయ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మిగిలిన గ్రామాల వివరాలు ఇంకా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. 90 శాతం వివరాలు రావడం తో ఇప్పటి వరకూ జరిగిన సర్వే ఆధారంగా మిషన్ అంత్యోదయ ర్యాంకులను తమ వెబ్ సైట్ లో ఉంచింది.

కార్ల పై అందమైన చిత్రాలను గీస్తూ, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రకళకు ప్రచారం కల్పిస్తూ, దేశవ్యాప్తంగా సాగుతున్న కార్టిస్ట్ యాత్ర 2018, నేటి నుంచి విజయవాడలో ప్రారంభంకానుంది. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ సాగుతున్న ఈ యాత్రలో భాగంగా అమరావతి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చిత్రాలను కార్ల పై గీయనున్నారు. స్థానికంగా ఉండే 30 మంది కళాకారులు, 20 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు కలిసి,అందమైన చిత్రాలను కార్లపై చిత్రీకరించనున్నారు.

cartist 22122017 2

దేశంలోని అనేక రాష్ట్రాలు, అక్కడి కళలు, సంస్కృతులను ప్రచారం చేసూ నవంబర్ 4వ తేదీ నుంచి ఈ యాత్ర సాగుతోంది. జైపూర్లో ప్రారంభమై ఇప్ప టికే అహమ్మదాబాద్ ముంబయి, పూణె, హైదరాబాద్, బెంగళూరుల్లో కార్యక్రమాలు నిర్వహించి. ప్రస్తుతం అమరావతికి చేరుకుంటోంది. విజయవాడలోని పీడబ్యూడీ మైదానంలో డిసెంబర్ 22, 23, 24వ తేదీల్లో ఈ చిత్రకళా ప్రదర్శన జరుగుతుంది. 121 రోజుల్లో దేశంలోని 18 ప్రధాన నగరాల మీదుగా, 9100 కిలో మీటర్ల దూరం కార్టిస్ట్ యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా వెయ్యి మంది కళాకారులు పాల్గొననున్నారు. ఎక్కడికక్కడ స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. వెళ్లే దారిలో కనీసం రెండు కోట్ల మంది తిలకించేలా ప్రణాళికలు రూపొందించారు.

cartist 22122017 3

ప్రతి నగరంలో నిర్వహించే చిత్ర కళా ఉత్సవంలో కనీసం రెండు లక్షల మంది సందర్శకులు వచ్చేలా చేయాలనేది ప్రణాళిక. 2015లో జైపూర్కు చెందిన హిమాను జె, కార్టిస్ట్ యాత్రకు రూపకల్పన చేశారు. పాత ఆటోమొబైల్ వాహనాల పై చిత్రకళను గీస్తూ, ఆటోఆర్ట్ పేరుతో ప్రచారం కల్పించేందుకు ఈ యాత్రను ప్రారంభించారు. పాత కార్ల పై చిత్ర విచిత్రమైన పెయింటింగ్లను ఆకట్టుకునేలా చిత్రీకరించడం, అది కూడా స్థానిక కళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కార్టిస్ట్ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఆసక్తి ఉన్నవాళ్లు తమ కార్లను తీసుకెళ్లి, అమరావతిని ప్రతిబింబించే చిత్రాలను ఉచితంగా గీయించుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read