ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డిస్కంలతో పాటుగా, ఇంధన శాఖ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ ఈఆర్‍సీ రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ లేఖలో వాడిన ఘాటు వ్యాఖ్యలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదపుగా రూ.25,257 కోట్ల బకాయలు చెల్లింపుల విషయంలో, ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న జాప్యాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. రూ.15,474 కోట్ల సబ్సిడీలతో పాటుగా, వివిధ శాఖలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన రూ.9,783 కోట్లు బకాయల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఏపీ ఈఆర్‍సీ ఘాటు లేఖ రాస్తూ, ఏపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ అంశం పై 14 రోజుల్లోగా స్పందన తెలియ చేయాలి అంటూ, హెచ్చరించింది. 14 రోజుల్లో ప్రభుత్వ శాఖలు నుంచి కానీ, స్థానిక సంస్థల నుంచి కానీ దీని పైన వివరణ రాని పక్షంలో, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనే అభిప్రాయాన్ని ఈఆర్సీ తమ లేఖలో ప్రధానంగా స్పష్టం చేసింది. ఇప్పటికే డిస్కంలు ప్రమద ఘంటికల్లో ఉన్న పరిస్థితి ఉందని, అవన్నీ కూడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నాయని తెలిపింది. అందుకే 14 రోజుల్లోగా ఈ అంశం పై, ప్రభుత్వం నుంచి రియాక్షన్ కోరుతున్నామని, ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం కనుక రాకపోతే విద్యుత్ ను నిలిపివేస్తాం అని హెచ్చరించింది.

jagan 12112021 2

ఈ లేఖను టిడిపి నేత, పీఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ బయట పెట్టారు. కొద్ది సేపటి క్రిందట ఈ లేఖను పయ్యావుల మీడియాకు విడుదల చేసారు. పయ్యావుల హైదరాబాద్ లో ఏపీ ఈఆర్‍సీతో భేటీ తరువాత, ఈ లేఖ రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంధన శాఖలో ఉన్న పరిస్థితితులు, డిస్కంల దారుణ పరిస్థితి పై, కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా ఈ అంశం పై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజలకు చెప్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఏపీ ఈఆర్‍సీతో జరిగిన సమావేశంలో కూడా పయ్యావుల కేశవ్, డిస్కంల ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ బకాయల పై ప్రధానంగా చర్చించారు. పయ్యావుల భేటీ తరువాత ఈ లేఖ రావటం, కొంత రాజకీయంగా కూడా చర్చకు దారి తీసింది. దీని పైన కొద్ది సేపట్లో కేశవ్ కూడా ఈ అంశం పై మీడియాతో మాట్లాడనున్నారు. మరి ప్రభుత్వం ఇన్ని బకాయలు 14 రోజుల్లో ఎలా ఈ బాకీ తీర్చుతుందో చూడాల్సి ఉంది. మొత్తంగా రూ.25,257 కోట్ల బకాయిలు అంటే, మాటలు కాదు. ఇన్నాళ్ళు ఇన్ని బాకీలు ఎందుకు పెడుతున్నారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read