తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న హైకోర్టులో పట్టాభి బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై ఈ రోజు విచారణ చేపడతామని హైకోర్టు ఆదేశించింది. ఉదయం ప్రభుత్వం న్యాయవాది తనకు మంగళవారం వరకు కౌంటర్ దాఖలు చేయటానికి సమయం ఇవ్వాలని కోరారు. ఎలాగూ ఇది బెయిల్ వచ్చే కేసు అని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఎక్కువ రోజులు సాగాదీసి పట్టాభిని జైల్లో ఉంచాలని ప్లాన్ వేసారు. అయితే ఈ ఎత్తుగడను కోర్టు అంగీకరించలేదు. ఈ రోజు మధ్యానం రెండు గంటలకు, లంచ్ అనంతరం విచారణ చేపతాడమని, సిద్ధం కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలకు సిద్ధం కావాలని, ఈ లోపు సమాచారం తెప్పించుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. లంచ్ మోషన్ పిటీషన్ పై వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని, నిబంధనలు కూడా ఇవే చెప్తున్నాయని హైకోర్టు పెర్కుంది. ఈ రోజు విచరణ ప్రారంభం అయిన వెంటనే, ఇటు ప్రభుత్వ నుంచి, పట్టాభి వైపు నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించారు.

pattabhi 23102021 2

ప్రధానంగా, పట్టాభి పై నమోదు చేసిన కేసులకు సంబంధించి, సెక్షన్లు అన్నీ కూడా ఏడు ఏళ్ల లోపు సెక్షన్లు కావటంతో 41ఏ నోటీస్ ఇచ్చి, ఆయన వివరణ తీసుకున్న అనంతరం ఆయన్ను వదిలి వేయాలని, విధాన పరమైన ప్రొసీజర్ ని పోలీసులు ఎక్కడా ఫాలో కాలేదని పట్టాభి న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. కింద కోర్టు కూడా ఇదే అంశాన్ని రికార్డు చేసి, ఆయన్ను రిమాండ్ కు పంపించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. నిన్ననే ఈ విషయం పై హైకోర్టు కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేసారని, అందుకే అరెస్ట్ చేసాం అని చెప్పటం సమంజసం కాదని, వ్యక్తులు, హోదాలు, ఇక్కడ పని చేయవని అన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి పట్టాభి చేసిన వ్యాఖ్యలు జడ్జి ముందు ప్లే చేసి చూపించారు. అయితే 41ఏ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించగా, సరైన సమాధానం ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపధ్యంలో,ఆయనకు బెయిల్ ఇస్తున్నాం అని కోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే లేట్ అవ్వటంతో, పట్టాభి సోమవారం విడుదల అయ్యే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read