మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పై, రెండు రోజుల క్రితం ప్రణాళిక ప్రకారం అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. పట్టాభి ప్రెస్ మీట్ లో సజ్జలని తిడితే, ఆ మాట తననే అన్నారని జగన్ మోహన్ రెడ్డి ఆపాదించుకుని మరీ, చేసిన హడావిడి అందరూ చూసారు. ఇక ఇక్కడ మరో గమ్మత్తు అయిన విషయం ఏమిటి అంటే, ఆ అటాక్ చేసింది మా వాళ్ళే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రకటించుకోవటం,అందరినీ ఆశ్చర్య పరిచింది. కొంత మంది తమ ఆత్మీయులు, ప్రేమ ఉన్న వాళ్ళు, అభిమానులు బీపీ పెరిగి, టిడిపి ఆఫీస్ ల పై రాష్ట్ర వ్యాప్తంగా దా-డు-లు చేసారు అంటూ, సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి చెప్పటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక డీజీపీ కూడా మొత్తం తప్పు అంతా పట్టాభిది అని తేల్చేసారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసినందుకే దా-డి చేసారు అట. ఇక పోలీసులు కూడా దా-డి జరిగిన పట్టాభినే అరెస్ట్ చేసారు. ఇలా జరుగుతున్న సంఘటనల పై టిడిపి స్పందిస్తూ, ఇది స్టేట్ స్పాన్సార్డ్ టెర్రరిజం అంటూ ప్రకటించి, దీక్షలు కూడా చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు , రేపు కూడా దీక్ష చేస్తున్నారు. అయితే టిడిపి నేతలు ఆరోపణలు చేయటం లేదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తున్నారు.

tdp 21102021 2

టిడిపి ఆఫీస్ పై అటాక్ చేయటానికి వస్తున్నారు అంటూ, 15 నిమిషాల ముందే టిడిపి కార్యాలయానికి సమాచారం వచ్చింది. అప్పటికే కొంత మంది కార్లు వేసుకుని ఆఫీసు బయట ఉన్నారు. వెంటనే టిడిపి సిబ్బంది మంగళగిరి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసారు. అయితే ఇది తమ పరిధి కాదని రూరల్ పోలీస్ లకు ఫోన్ చేయమన్నారు. అక్కడకు ఫోన్ చేస్తే, వెంటనే స్పందించకుండా, పోలీసులు సాగదీసిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక పార్టీ స్టేట్ ఆఫీస్ పై అటాక్ జరుగుతుంది అంటే, వెంటనే రాకుండా, మీ పేరు ఏంటి, మీ నాన్న పేరు ఏంటి, మీ వయసు ఎంత, మీ పోస్ట్ ఏంటి, మీరు ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు, మీకు వైసిపీ వాళ్ళు వస్తున్నారని ఎవరు చెప్పారు, మీరు చూడకుండా ఎలా చెప్తున్నారు, ఇలా అనేక అనేక ప్రశ్నలు వేసి, సాగ దీసారు. ఈ ఆడియో క్లిప్ తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి, పోలీసులు వచ్చి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేది కాదని, ఎందుకు రాలేదో పోలీసులే చెప్పాలని అంటున్నారు. ఇది టిడిపి విడుదల చేసిన ఆడియో. https://twitter.com/JaiTDP/status/1451184676953985027

Advertisements

Advertisements

Latest Articles

Most Read