గత వారం పది రోజులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్, కరెంటు కోతలు గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉండటం, బహిరంగ మార్కెట్ లో యూనిట్ 25 రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందటం, సామర్ధ్యం మేర విద్యుత్ ఉత్పత్తి జరగకపోవటం, వీటి అన్ని కారణాలతో ఏపిలో విద్యుత్ సంక్షోభం అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇంత బలంగా రావటానికి కారణం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారు, జగన్ మోహన్ రెడ్డి వాయిస్ వినిపించే సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చాలా తక్కువ అందుబాటులో ఉందని, ప్రజలు విద్యుత్ తగ్గించుకోవాలని సాయంత్రం ఏసిలు వాడకం తగ్గించాలని, లేకపోతే వచ్చే వేసవి భయంకరంగా విద్యుత్ సమస్య ఉంటుందని అన్నారు. ఇక పవర్ కట్స్ గురించి అడగగా, ఇప్పటికి అయితే ఏమి లేదు అని, కానీ ప్రజలు సిద్ధంగా ఉండాలని అని అన్నారు. దీంతో విద్యుత్ సంక్షోభం నిజమే అని అందరూ నమ్మారు. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి తగ్గట్టే కరెంటు ఎక్కువ రేటుకి కొంటున్నాం అని, బొగ్గు కావాలని చెప్తూ వచ్చారు. జగన్ కూడా ప్రధానికి లేఖ రాసారు. ఇదే సామయంలో రాష్ట్రంలో అనేక చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయి.

sajjala 147102021 2

దీంతో ఇంకేముంది పండుగ తరువాత, విద్యుత్ కోతలు ఉంటాయి అంటూ ప్రచారం జరిగింది. అధికారులు మాటలు, సలహాదారులు మాటలు నమ్మిన మీడియా చానల్స్, ఇతరులు, కరెంటు కోతలు వచ్చేస్తున్నాయి అంటూ ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం పై విద్యుత్ శాఖా మంత్రి బాలినేని తీవ్రంగా స్పందించారు. అసలు విద్యుత్ కోతలు ఉంటాయని ఎవరు చెప్పారని, రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉందని, కొంటున్నాం అని, కొరత రాకుండా చూస్తున్నాం అని, ప్రజలు ఆ ప్రచారం నమ్మవద్దు అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు విద్యుత్ కోతలు అని ప్రచారం చేస్తే, చర్యలు తీసుకుంటాం అని కూడా హెచ్చరించారు. అయితే మంత్రి బాలినేని మాటలు, సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ గా చేసి చేసారా అనే అనుమానం కలుగుతుంది. ఏమి లేనప్పుడు మీడియా ముందుకు వచ్చి, సజ్జలే కరెంటు కష్టాలు గురించి చెప్తూ, వాడకం తగ్గించుకోవాలని, లేదని కోతలకు రెడీ అవ్వాలని చెప్పారు. మరి మంత్రిగారు, ముందుగా సజ్జల గారి పై చర్యలు తీసుకుంటారా ? వైసిపీలో ఏమి జరుగుతుందో మరి, ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read