ఆంధ్రపదేశ్ బీజేపీ శాఖ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దెబ్బకు దిగి వచ్చింది. నిన్న అమిత్ షా, తిరుపతిలో జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం నిన్న, ఏపి బీజేపీ నేతలకు పూర్తిగా క్లాస్ పీకారు. రాష్ట్రంలో పలు అంశాల పై బీజేపీ నేతలు స్పందిస్తున్న తీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే అమిత్ షా, నిన్న చేసిన దిశా నిర్దేశంతో, ఈ రోజే బీజేపీ నేతలు కదిలారు. ఒక్క రోజులునే బీజేపీ నేతలు వ్యవహార శైలి మార్చుకున్నారు. ఈ రోజు విజయవాడలో జరిగిన, ఒక సమావేశంలో, బీజేపీ రాష్ట్ర నేతలు, ప్రధానంగా అమరావతి రైతుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించటమే కాకుండా, అమరావతి రైతుల మహా పాదయాత్రలో అవసరమైన మేర పాల్గుంటాం అని వాళ్ళు ప్రకటించారు. అదే విధంగా, ఈ నెల 26 వ తేదీన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పై కార్యవర్గంలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా, మరి కొన్ని కీలక అంశాల పై కూడా చర్చించబోతున్నారు. అదే విధంగా, జనసేనతో సమన్వయం, వారితో కలిసి చేసే ప్రజా వ్యతిరేక విధానాల పై కూడా బీజేపీ ఈ కార్యవర్గ సమావేశంలో కార్యాచరణ రూపొందించబోతున్నట్టు తెలిసింది.

amit 16112021 2

అదే విధంగా అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి, ఇప్పటికే స్థానిక నేతలు, తాము పాదయాత్రలో పాల్గుంటాం అని, అన్ని రాజకీయ పక్షాలు, కులాలు, మతాలూ, రాజకీయాలకు అతీతంగా, పాల్గుంటున్న సమయంలో, బీజేపీ పాల్గునకపోతే, రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడటానికి, పైగా రైతులు అంతా కూడా పాల్గుంటున్న సమయంలో, మనం పాల్గునక పోతే ఇబ్బందులు ఎదురు అవుతాయని చెప్తున్నా కూడా, ఏపి బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్ళ లేదు. నిన్న అమిత్ షా, ఏదైతే తిరుపతిలో దిశానిర్దేశం చేసారో, ఆ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గునటం లేదని నిలదీసారో, ఆ తరువాత ఈ రోజు ఏపి బీజేపీ అమరావతి పాదయాత్రలో పాల్గుంటాం అని చెప్పింది. సోము వీర్రాజు ఈ రోజు ఈ ప్రకటన చేసారు. ఇప్పటికే సియం రమేష్, తాను తిరుపతిలో పాల్గుంటాను అని చెప్పగా, ఇతర నేతలు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు. మొత్తానికి అమిత్ షా పీకిన క్లాస్ తో, వైసీపీ వెనుక పడటం ఆపి, ఇక ప్రజా సమస్యల పై కదిలే విధంగా బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read