ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు, బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీరియస్ క్లాస్ పీకారు. ఈ రోజు రెండు సమావేశాలు తిరుపతిలో జరిగాయి. ముందుగా ఆయన ఎంపీలు సియం రమేష్, సుజనా చౌదరిలతో విడిగా దాదాపుగా గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటుగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదే విధంగా పార్టీ నేతలతో అమిత్ షా భేటీ నిర్వహించారు. ఈ భేటీ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నేతల తీరు పై క్లాస్ పీకారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి మీడియాని, రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో చెప్పాలి అంటూ, ఆయన బీజేపీ నేతలను నిలదీశారు. ఎవరో ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదం జరిగితే, అది పార్టీ ఎందుకు పులుముకుని, ఆ ఛానల్ ను మీరు ఎందుకు బ్యాన్ చేసారని నిలదీశారు. మరో పక్క సాక్షి ఛానల్ ను మీరు ఎందుకు బహిష్కరించ లేదని నిలదీశారు. సాక్షిలో ఏపి బీజేపీ నేతల వార్తలు వస్తున్నాయా అని అడిగారు. ఇటువంటి పనులు చేయవద్దు అని బీజేపీ నేతలకు అమిత్ షా స్పష్టం చేసారు. దీంతో పాటుగా, రాజధాని రైతులు చేస్తున్న న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో మీరు ఎందుకు పాల్గునటం లేదని బీజేపీ నేతలను నిలదీయటమే కాకుండా, కొంత మంది బీజేపీ నేతలు పాల్గుంటే, వారిని ఎందుకు వివరణ అడగటం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు.

bjp 15112021 2

అమరావతి రాజధాని అని ఏకగ్రీవ తీర్మానం చేసి, ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గునలేదని ప్రశ్నించారు. దీంతో పాటుగా, పొత్తులు గురించి పదే పదే, మాటలు వినిపిస్తున్నాయని, పొత్తులు గురించి మీరు ఎవరూ మాట్లాడ వద్దని స్పష్టం చేసారు. ఈ దేశంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనేది, కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రమే నిర్ణయిస్తారని, మీరెవరూ పొత్తులు విషయం పై మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఇక్కడ కొంత మంది అధికారులు కేంద్ర పెద్దల పేర్లు చెప్పుకుని, రాష్ట్రంలో పెత్తనం చేయాలని చూస్తే మాత్రం, ఎట్టి పరిస్థితిలో కూడా సహించబోమని స్పష్టం చేసింది. మన ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు, ఎందుకు వారితో యుద్ధం చేయటం లేదని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో పార్టీ నుంచి కొంత మందిని సస్పెండ్ చేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కు అమిత్ షా గట్టిగా క్లాస్ పీకారని తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ అవినీతి పై పోరాడాలని స్పష్టం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read