రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాల పై ఆసక్తి నెలకొంది. దొంగ ఓటర్లు గెలుస్తారా ? లేక వారిని అడ్డుకట్ట వేసిన వారు గెలుస్తారా అనే చర్చ మొదలైంది. వైసీపీ ఎంత మేరకు దొంగ ఓట్లు వేసింది, టిడిపి ఎంత మేరకు దొంగ ఓటర్లను అడ్డుకుంది అనే అంశం పైనే ఎవరు గెలుస్తారు అనే అంశం ఆడరిపడి ఉంటుంది. అయితే ఈ రోజు కుప్పం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ మొదలైంది. మరో పక్క ఎన్నికల్లో జరిగినట్టే, కౌంటింగ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాసం ఉందని టిడిపి భావిస్తుంది. తమ ఏజెంట్లకు అన్ని విషయాలు చెప్పి పంపించింది. ఎక్కడా అదుపు తప్పకుండా, చూడాలని, ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఉంటే ఎన్నికల కేంద్రం వద్ద చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండే నోటీస్ బోర్డుల విషయంలో, మొత్తం తారుమారు చేసి పెట్టారు. దీంతో ఏజెంట్లు ఎటు వేళ్ళలో తెలియక తిప్పలు పడుతున్నారు. మొదటి రౌండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన కౌంటింగ్ కు సంబంధించిన నోటీస్ బోర్డుని, రెండో రౌండ్ కౌంటింగ్ కేంద్రం వద్ద పెట్టారు. ఈ నోటీస్ బోర్డుల తికమకతో, ఏజెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వేళ్ళలో తెలియక తికమక పడుతున్నారు.

kuppam 17112021 2

ఇక మరో పక్క పోలీసులు ఓవర్ ఆక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియా పైన ఆంక్షలు పెడుతూ, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, లేకపోతే కేసులు పెడతామాని బెదిరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరు పైన, జర్నలిస్టులు మండి పడుతున్నారు. మొత్తం 24 వార్డులు ఉండగా, ఒక వార్డులో ఫోర్జరీ సంతకం చేసి, నామినేషన్ ఉపసంహరించారు. మొత్తం 23 వార్డుల్లో ఎన్నికలు జరగగా, వాటి కౌంటింగ్ జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితం వచ్చే సరికి ఉదయం 11 గంటలు అయ్యే అవకాసం ఉంది. అప్పటి నుంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన అరాచకం నేపధ్యంలో, పోలీసులు కూడా భద్రత పెంచారు. రెండు పార్టీ కార్యాలయాలను పోలీసులు తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన ప్రజలు, అసలు ఇది ఎన్నికేనా అనే ప్రశ్నలు వచ్చాయి. ఒక ఎన్నిక కోసం, అధికార పార్టీ ఇంత అరాచకం చేయటం వెనుక, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన తప్ప వేరేది లేదు. చూద్దాం ఏమి జరుగుతాయో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read