ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొంత అస్వస్థతకు గురి కావటంతో, ఒక్కసారిగా రాష్ట్ర యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యం పాలు అయ్యారని తెలియటంతో, వెంటనే అధికారులు అలెర్ట్ అయ్యారు. గన్నవరంలో ప్రత్యేక విమానం తెప్పించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను గన్నవరం ఎయిర్ పోర్ట్ కు తీసుకుని వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఆయన సమస్య ఏమిటి అనేది తెలియదు. కొద్దిగా క-రో-నా లక్ష్యణాలు ఉన్నాయని, ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు రావటంతోనే తరలించారని, వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది. తెలంగాణా గవర్నర్, వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం విషయం పై , కొద్ది సేపటి క్రితం హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసాయి. ఆయనకు క-రో-నా వచ్చిందని, ట్రీట్మెంట్ అందుతుందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read