మన రాష్ట్రంలో వ్యవస్థలును లెక్క చేయకపోవటం, రాజ్యాంగ వ్యవస్థలను కూడా హేళన చేయటం, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి బాగా అలవాటు. ఎలక్షన్ కమిషన్ అయినా లెక్క ఉండదు, శాసనమండలి చైర్మన్ అయినా లెక్క ఉండదు, మీడియా అయినా లెక్క ఉండదు, న్యాయమూర్తులు అయినా లెక్క ఉండదు, న్యాయస్థానాలు అయినా లెక్క ఉండదు. చివరకు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాను కూడా కుళ్ళు రాజకీయాల్లోకి లాగుతారు. చేసేవి చట్టవిరుద్ధమైన పనులు. అవి మాత్రం కోర్టులు కొట్టివేస్తే మాత్రం, న్యాయమూర్తులను దూషిస్తారు. ఇలాగే ఏడాది క్రితం, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చోడిని చేసి, అతని పై ప్రవర్తించిన తీరుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబిఐ ఎంక్వయిరీ ఆదేశించింది. అయితే దీని పై వైసీపీ నేతలు, క్యాడర్ మొత్తం కోర్టులను దూషించారు. దీంతో చరిత్రలో మొదటి సారి, హైకోర్టు బాధితులుగా కేసు నమోదు చేసి, ఈ కేసు కూడా సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే గత వారం రోజులుగా సిబిఐ తీరు పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సిబిఐ తీరు అనుమానాలను తావు ఇస్తుందని,నిందితులను రక్షించే విధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యనించింది. అయితే సిబిఐ మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తూ, తాము విదేశాల్లో ఉన్న వారిని పట్టుకోలేక పోయాం అని కోర్టుకు తెలిపింది.

punch 02112021 2

నిన్న ఈ కేసు పై మళ్ళీ విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంలో ట్విస్ట్ నెలకొంది. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి అడ్రస్ దొరకటం లేదు అంటూ సిబిఐ కోర్టుకు చెప్పటంత, రిజిస్టార్ తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్, నిన్న కోర్టు ముందు పంచ్ ప్రభాకర్ వివరాలు అన్నీ ఉంచారు. పంచ్ ప్రభాకర్ అడ్డ్రెస్ తో పాటుగా,అతని ఫోన్ నెంబర్, అతని ఈమెయిలు ఐడి ఇలా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచారు. మరి ఇప్పుడైనా సిబిఐ ఈ వివరాలు పట్టుకుని అతన్ని పట్టుకుని వస్తుందో, లేదా మరేదైనా సాకులు చెప్తుందేమో చూడాలి. అలాగే ట్విట్టర్, యూట్యూబ్ లను కూడా ప్రతి వాదులుగా చేర్చాలని కోర్టుకు చెప్పటంతో, కోర్టు కూడా దీనికి అంగీకరించింది. ఇక నిన్న ప్రభుత్వం తరుపు అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ ఇప్పటికే కోర్టుల పై వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ కోరుకున్నారని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, 2020 మే తర్వాత హైకోర్ట్ పైన ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా ? దీని పై మీరు చెప్పగలరా అని ప్రశ్నించగా, అటు వైపు నుంచి సరైన సమాధానం రాలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read