వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు. ఇది వైసీపీ తరుచూ చేసే ఎదురు దాడి. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఎదురు దాడి ఇది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తే, అసలు ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి బయట ఉండేవారా అని ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే వాస్తవంలో మాత్రం, అన్నీ వైసిపీకి అనుకూలంగా జరుగుతూ ఉంటారు. అలా అని వైసీపీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తుందని ఎవరూ అనరు కానీ, కొన్ని రకాల ఫిర్యాదులు అయితే వెళ్ళాల్సిన వాళ్లకు వెళ్తున్నాయి. తాజాగా ఒక సంఘటన జరిగింది. ఆయన ఒక మంత్రి గారి భర్త. ఐటి కమీషనర్ గా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్కమ్ టాక్స్. ఇది ఎంత కీలకమైన డిపార్టుమెంటు అనేది అందరికీ తెలిసిందే. ఆయన వచ్చారని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు ఇదే వారి పాలిట శాపం అయ్యింది. చివరకు ఇది హోంమంత్రి దాకా ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భర్త ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. ఆయన గతంలో ముంబై, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ ఉండేవారు.
అయితే ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ఐటి కమీషనర్ గా విజయవాడ వచ్చారు. ఆయన వచ్చారని తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి వచ్చారు. అయితే ఈ నియామకం వెనుక కుట్ర ఉందని,ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయటానికి, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టటానికి, ఈ నియామకాలు అంటూ, విమర్శలు వచ్చాయి. దీని పైన, బీజేపీ ఎంపీ ఒకరు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఈ నియామకం సర్వీస్ రూల్స్ కు విరుద్ధం అని, వెంటనే ఈ నియామకాన్ని వెనక్కు తేవాలని లేఖలో తెలిపారు. ఇక ఇదే ఎంపీ మరో ఫిర్యాదు కూడా చేసారు. సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ లో, జగన్ తరుపున కేసులు వాదించే సుభాష్ అనే న్యాయవాదిని నియమించారని, నిందితులు వెంట ఉండే వారికి, సిబిఐలో పదవులు ఎలా ఇస్తారాని, ఇది నైతికంగా తప్పుడు సంకేతాలు వెళ్తుందని, ఈ నియామకం కూడా రద్దు చేయాలి అంటూ, ఆ ఎంపీ అమిత్ షాకు లేఖ రాసారు.