ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బుల కోసం కటకటలాడుతుంది అనే వార్తలు ప్రతి రోజు చూస్తున్నాం. ఇప్పటికే పరిమితికి మించి అప్పు చేసి, మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తేవటం, ఆస్తులు అమ్మి అప్పులు తేవటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే వీటి పై ఎప్పటికప్పుడు పలువురు న్యాయస్థానాల్లో పోరాడి, భవిష్యత్తు తరాలకు చెందాల్సిన ఆస్తులను కాపాడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏదో ఒక మార్గంలో ముందుకు వెళ్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో అంశం బయటకు వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచిన జీవో ఒకటి బయట పడింది. ఇది ఏమిటి అంటే, గతంలో అంటే 2012లో అప్పటి ఉమ్మడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక జీవో తెచ్చారు. ఆ జీవో సామాన్యంగా తేలేదు, సమగ్ర అధ్యయనం జరిపి, అఖిలపక్ష సమావేశం పెట్టి, ప్రభుత్వ భూములు పై ఒక సమగ్ర పాలసీ ఒకటి తెస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక జీవో వచ్చింది. ఈ జీవో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూములను కాపాడటం. ప్రభుత్వ భూములు, ఆదాయం కోసం అసలు అమ్మకూడదు అనేది ఇందులో ముఖ్యమైన అంశం. మొత్తం 44 పేజీలు  ఉన్న జీవోని, అప్పటి నుంచి ప్రభుత్వాలు ఫాలో అవుతూ వచ్చాయి. తరువాత వచ్చిన టిడిపి ప్రభుత్వం కూడా జీవో 571ను అనుసరించే ముందుకు సాగింది.

jagan 01112021 2

అయితే ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు అమ్మితేనే డబ్బు అనే విధంగా, భూములు అమ్మకానికి మిషన్ ఏపి అని ఒక పేరు పెట్టి, భూములు అమ్మకానికి పెట్టింది. దీని పై పలువురు కోర్టుకు వెళ్ళటంతో, కోర్టు ఈ తతంగాన్ని ఆపింది. అయితే ఈ జీవో ఒక్కటే అడ్డు అని భావించిన ప్రభుత్వం, అప్పటి కిరణ్ కుమార్ రెడ్డిని జీవోని సవరిస్తూ, మరో జీవో అయిన 243 జారీ చేసింది. అయితే ఇలాంటి పనులు చేసుకోవటానికే, జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఈ జీవో ఆమోదం పొందాలి అంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావటం, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య, ఈ జీవో క్యాబినెట్ సమావేశంలో పెట్టటంతో, ఇప్పుడు ఈ జీవో బహిర్గతం అయ్యింది. క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించటంతో, ఇక ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు అనమాట. మరి దీని పై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, కోర్టుకు ఏమి చెపుతుంది, కోర్టు ఏమి చేస్తుంది, మన భవిషత్తు తరాలకు చెందాల్సిన భూమి ఉంటుందా, ఉండగా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read