సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వర్తలు విని, ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ తిన్నారు. అసలు ఏమైందో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే చాలా రోజులుగా నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో బాధ పడుతున్నారు. ఆయన కుడి భుజం గత ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సర్జరీ ఒక్కటే మార్గం అని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. అయితే గత ఆరు నెలలు నుంచి ఆయన సినిమా షూటింగ్లు, అలాగే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో, సర్జరీన వాయిదా వేస్తూ వచ్చారు. అఖండ సినిమా షూటింగ్ లో, గుర్రం మీద స్వారీ చేస్తూ, బాలయ్య కొన్ని సన్నివేశాలు చేసారు. ఆ సమయంలో కూడా బాలయ్య బాగా ఇబ్బంది పడ్డారని, నొప్పి ఎక్కువ కావటంతో, తిరిగి డాక్టర్లను సంప్రదించగా, సర్జరీ అవసరం ఆని చెప్పారు. దీంతో బాలయ్య అక్టోబర్ 31న, కుడి బుజం సర్జరీ కోసం, బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్ లతో కూడిన డాక్టర్ల బృందం, బాలయ్య కూడా దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి బాలయ్య కూడా సర్జరీ చేసారు. ఈ సర్జరీ కూడా విజయవంతం అయ్యిందని, హాస్పిటల్ వర్గాలు చెప్పాయి.
బాలయ్య కూడా పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని, బాలయ్య సన్నిహితులు చెప్పారు. బాలయ్యకు సర్జరీ జరగటం, సక్సెస్ అవ్వటం, ఏ ఇబ్బందులు లేకపోవటంతో, ఈ రోజు బాలయ్యను హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసారు. దీంతో ఆయన ఈ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వచ్చేసారు. అయితే ఇంత జరిగినా ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు, సర్జరీ అయినట్టు కూడా ఎవరికీ తెలియదు. అభిమానులకు ముందే ఈ విషయం చెప్తే, హాస్పిటల్ వద్దకు వస్తారనే ఉద్దేశంతో, డిశ్చార్జ్ అయ్యే ముందు, ఈ విషయం మీడియాకు చెప్పారు. ఈ రోజు బాలయ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో, ఆయనను డిశ్చార్జ్ కూడా చేసేసరని చెప్పటంతో, అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే బాలయ్య అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా మరో నెల రెండు నెలల్లో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఇక మొదటి సారి బాలయ్య యాంకర్ కూడా అవతారం ఎత్తారు. అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో ఈ కార్యక్రమం ఓటిటిలో రానుంది.