సాక్షి పత్రిక గురించి అందరికీ తెలిసిందే. ఇది జగన్ మోహన్ రెడ్డికి చెందిన పత్రిక. ఎదుటి పక్షం పై ఫేక్ చేయటంలో ఒక రికార్డ్. ఎవరు ఏమి అనుకున్నా, తమకు అనుకూలంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాఠకుల కోసం, వాళ్ళు ఎంతటికైనా ప్రచారాలు చేస్తారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండటంతో సాక్షి పంట పండింది. ఇప్పటికే సాక్షిలో ఉద్యోగులను కొంత మందిని ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సజ్జల కూడా, అక్కడ నుంచి వచ్చిన వారే. ఇక సాక్షి టీవీ, పేపర్ కు ఇచ్చే ప్రకటనలు, దాని కోసం పెట్టే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వరకు సరే, ఇవన్నీ సహజంగా జరిగేయే కదా, అధికారం ఉంటే, సొంత ప్రయోజనాలు కాపాడటం వెన్నతో పెట్టిన విద్య అని అనుకోవచ్చు. కాని ఇప్పుడు బయట పడిన విషయం చూస్తే అవాక్కవ్వక మానరు. ఏకంగా అధికారులే ఇప్పుడు సాక్షి కోసం రంగంలోకి దిగారు. సహజంగా మన ఇంటికి ఏజెంట్లు వస్తూ ఉంటారు. మా పేపెర్ వేయించుకోండి, ఏడాదికి ఇంత, ఆరు నెలలకు ఇంత అంటూ, ఆఫర్లు ఇస్తారు. సారిగ్గా ఇలాగే సాక్షి పేపర్ వేయించుకోవాలి అంటూ, అధికారులు ఏజెంట్ల అవతారం ఎత్తడం, అందరినీ ఆశ్చర్య పరిచింది. మరీ అధికారులు ఇలా ఉత్తర్వులు ఇవ్వటంతో, ఆశ్చర్యపోతున్నారు.

sakshi 31102021 2

ఎలాగైనా సాక్షి సర్క్యులేషన్‌ పెంచి, ఈనాడుని దాటాలనే ఆలోచనో లేదా ప్రభుత్వ డబ్బుతో లాభం పొందాలనో కానీ, కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలు, మునిసిపల్‌ ఆఫీసుల్లో, జగన్ పత్రిక అయిన సాక్షి పేపర్ వేయించుకోవాలి అంటూ ఆదేశాలు వెళ్ళాయి. ఏడాదికి సరిపడా డబ్బులు కట్టాలని, ఆ డబ్బులు ఎలా విడుదల చేయాలో కూడా సూచించారు. జగన్ పత్రికకు చందాలు కట్టాలని, గ్రామ సచివాలయాలకు అధికారికంగా ఆదేశాలు వెళ్ళటం చూసాం. ఇప్పుడు ఏకంగా మునిసిపాలిటీల్లో తీర్మానాలు చేసి పంపిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అజెండా చేర్చారు. ఇక్కడ మరో వింత ఏమిటి అంటే, ప్రతి కార్యాలయానికి రెండు సాక్షి కాపీలు వేయాలని తీర్మానం చేయటం హైలైట్. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సాధారణం అయిపోయాయి. ఒక ఆఫీస్ లో ఒక పేపెర్ ఉంటుంది కాని, రెండు కాపిలు ఎందుకో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read