తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో రెండో రోజు పర్యటన చేసారు. అయితే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేసే పోరాటం కుప్పం నుంచే మొదలు పెడుతున్నా అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం, ఇప్పటి నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తాయి అనే సమాచారమో ఏమో కానీ, చంద్రబాబు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఈ రోజు చంద్రబాబు మొట్టమొదటి ఎన్నికల హామీని ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లను నిర్మించొద్దు అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లు నిర్మిస్తాం అంటూ చంద్రబాబు మొట్టమొదటి ఎన్నికల హామీని ఇచ్చారు. 1983 నుండి అలాట్ చేసిన వాటికి, రూ.10 వేలు కడితే, ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేస్తాం అంటున్నారని, అవి కట్టక్కర్లేదు అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ఇచ్చిన మొదటి ఎన్నికల హామీ ఇదే అని అనుకోవాలి. ఇళ్ల స్థలాలు ఇళ్ల విషయంలో ఇప్పటికే జగన్ మోసం చేసారనే భావన ప్రజల్లో ఉంది. చంద్రబాబు హాయాంలో కట్టిన ఇళ్లు ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి లబ్ది దారులకు ఇవ్వక పోవటంతో, వారు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు.

cbn promise 30102021 2

ఇక చంద్రబాబు మాట్లాడుతూ, "ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించా. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతికి తెలిపా. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పేదల కోసం ధర్మపోరాటం చేస్తుంటే ప్రజలే కాపాడుకుంటారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు. రూ.8 వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీస్‌పై దా-డి చేశారు. కుప్పం వస్తే నాపై బాంబులేస్తారట.. మీ బాంబులకు నేను భయపడతానా?. నాపై 23 క్లెమోర్ బాంబులేశారు.. ఆ వెంకన్నే కాపాడారు. నన్ను ప్రజాదేవుళ్లే కాపాడుకుంటారు. జగన్ రెడ్డి వచ్చారు.. కొత్త బ్రాండ్లు తెచ్చారు. స్పెషల్ స్టేటస్ తేలేదు కానీ.. స్పెషల్ స్టేటస్‌పై కొత్త బ్రాండ్ తెచ్చారు. నాసిరకం బ్రాండ్లపై మూడు రెట్లు ధరలు పెంచారు. సగం డబ్బులు జగన్ రెడ్డికి.. కొంత ట్రెజరీకి వెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు మద్యం ధరలు కూడా పెరిగాయి "

Advertisements

Advertisements

Latest Articles

Most Read