రెండున్నరేళ్ళు అవ్వటంతో, మంత్రి వర్గం మొత్తం మారిపోతుంది, కొత్త మంత్రి వర్గం వస్తుందని ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. మంత్రివర్గం మొత్తం మార్చేస్తున్నారని ప్రచారం జరిగింది. దీనికి మంత్రి బాలినేని వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. డిసెంబర్ నాటికి, జగన్ సగం సమయం పూర్తవుతుంది. సంక్రాంతి నాటికి కొత్త మంత్రివర్గం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక ప్రస్తుత మంత్రులు కూడా తమ శాఖ పోకుండా, తమ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఆశావహులు కూడా తమ తమ ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే మంత్రిత్వ మార్పులు పై దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ఒక్కసారిగా కొన్ని మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేస్తూ, నిన్న రాత్రి నిర్ణయం ప్రకటించటంతో ఒక్కసారిగా ఆసక్తి రేగింది. అయితే ఇది కేవలం రెండు శాఖల వరుకే పరిమితం అయ్యాయి. ఈ రోజు రేపట్లో మరికొన్ని ఉత్తర్వులు ఏమైనా వస్తాయి ఏమో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, రెండు శాఖల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ జారీ చేసారు.

swamy 31102021 2

ఇందులో ప్రధానంగా, ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి దగ్గర రెండు శాఖలు ఉన్నాయి. రెండు శాఖలు చాలా కీలకమైన శాఖలే. ఒకటి ఎక్సైజ్‌ శాఖ కాగా, రెండోది వాణిజ్య పన్నుల శాఖ. రెండు శాఖలు ఉన్న మంత్రి నారాయణస్వామి నుంచి ఒక శాఖను కట్ చేస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. దాని ప్రకారం ఇక నుంచి నారాయణస్వామి కేవలం ఎక్సైజ్‌ శాఖ మాత్రమే నిర్వహిస్తారు. ఆయాన నుంచి వాణిజ్య పన్నుల శాఖను తప్పించారు. ఈ వాణిజ్య పన్నుల శాఖను కొత్తగా, ఆర్ధిక మంత్రి బుగ్గనకే ఇచ్చారు. ఇప్పటికే బుగ్గన మూడు శాఖలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖను బుగ్గన చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా బుగ్గనకు మరో శాఖ అయిన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతులు కూడా ఇచ్చారు. దీంతో బుగ్గనకు మొత్తం నాలుగు శాఖలు ఉండనున్నాయి. ఈ మార్పు ఎందుకు చేసారో తెలియదు కానీ, నిన్న రాత్రి ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read