ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాతే ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ రోజు, అంటే నవంబర్ ఒకటో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని తేల్చారు. సరే ప్రభుత్వాలు తేల్చాయి కాబట్టి, మనం కూడా బాధ్యత గల పౌరులుగా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇష్టం ఉన్నవారు ఈ రోజుని సెలెబ్రేట్ చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. కానీ అసలు ఈ రోజుని మనం రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేసుకోవటం సమంజసమేనా అనే చర్చ అయితే చేయాల్సిందే. దీని పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి, అక్టోబర్ 1 న, 1953 లో కర్నూల్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1956లో విశాలాంధ్ర ఏర్పడే దాకా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం, అక్టోబర్ 1 గానే జరుపుకున్నాం. భౌగోళిక స్వరూపంలో 1953 లో ఏర్పడిన రాష్ట్రానికి, ఇప్పటి నవ్యాంధ్రకు పోలిక ఉంది. కాకపోతే అప్పట్లో భద్రాచలం ఉండేది, ఇప్పుడు లేదు. అది ఒక్కటే తేడా. తరువాత విశాలాంధ్ర ఏర్పడింది. తరువాత 1956 నవంబర్ 1న, విశాలాంధ్ర ఏర్పడింది. అంటే ఇప్పటి ఆంధ్రా, తెలంగాణా కలిపి ఓకే రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది. పొట్టిశ్రీరాములు గారి త్యాగ ఫలితం ఉమ్మడి రాష్ట్రం.

andhra 01112021 2

తరువాత ప్రత్యేక తెలంగాణా కోసం కొట్లాటలు మొదలు అయ్యాయి. కేసిఆర్ టీఆర్ఎస్ పెట్టిన తరువాత, ఆంధ్ర ప్రాంతం వారిని తిట్టటం అనే సంస్కృతీ కూడా మొదలైంది. దీనికి ఉద్యమంలో ఇట్టాం అనే సమర్ధింపులు కూడా ఉన్నాయి. 2014 జూన్ 2న తెలంగాణా ఉద్యమం ఫలించి, ప్రత్యెక రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1 న ఎక్కడ ఉన్నామో అక్కడికే వచ్చేసాం. భౌగోళిక స్వరూపంలో అప్పటి లాగే వచ్చేసాం. ఇందాక చెప్పినట్టు భద్రాచలం లేదు అంతే. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, 1953 అక్టోబర్ 1 మన పుట్టిన రోజు, 1956 నవంబర్ 1 మన పెళ్లి రోజు, 2014 జూన్ 2 పెళ్లి పెటాకులు అయిన రోజు. పెళ్లి పెటాకులు అయిన తరువాత, పెళ్లి రోజుని, పుట్టిన రోజుగా , ఉత్సవంలాగా, ఈ రోజు రాష్ట్ర అవతరణ అని మనం జరుపుకుంటున్నాం. దీని పై భిన్నాభిప్రాయలు ఉన్నా, ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్ళటంతో, ప్రధాని దగ్గర నుంచి అందరూ ఈ రోజే మన రాష్ట్ర అవతరణం అంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, జూన్ 2న నవ నిర్మాణ దీక్ష చేసే వారు కానీ, ఏ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేదు. మరి ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవటం కరెక్టో కాదో అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read