కేసిఆర్, జగన్ మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల ముందే, అక్కడ జగన్,ఇక్కడ మనం వస్తున్నాం అని చెప్పారు. తరువాత చంద్రబాబు గెలిచిన తరువాత, చంద్రబాబుని ఇబ్బందులు పెడుతూనే వచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికల సమయానికి, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని తన మంత్రులను పంపించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కులాలను రెచ్చగొట్టటం, ఎన్నికల్లో జగన్ కు అన్ని రకాల సహకారాలు అందించటం తెలిసిందే. తరువాత జగన్ గెలిచిన తరువాత, ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు, దావత్ లు చేసుకున్నారు. జగన్, కేసీఆర్ కు కావాల్సినవి అన్నీ ఇచ్చేసారు. ఇలా ఎంతో అద్భుతంగా సాగింది. ఏమైందో, ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ నెమ్మదిగా మాటల యుద్ధం మొదలు పెట్టింది. సహజంగా కేసీఆర్ అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకునే గుణం కాబట్టి, ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. రెండు రోజుల నుంచి ఒక కొత్త చర్చ మొదలయ్యింది. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లి బదులు తెలుగు తల్లి వచ్చిందని, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి వేయాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఉందని, అందుకే ఆంధ్రాలో కొత్త పార్టీ అంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

kcr 30102021 2

కోట్లాడి రాష్ట్రం సాధించి, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రా ప్రస్తావన ఎందుకు అని దీని వెనుక ఏదో కుట్ర ఉందని అన్నారు. అన్నట్టే, తరువాత రోజు పేర్ని నాని మాట్లాడుతూ, కేసీఆర్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపిస్తే చాలు అని, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా ఒక తీర్మానం చేస్తే చాలని రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోవచ్చు అని అన్నారు. దీని పై రేవంత్ రెడ్డి మళ్ళీ స్పందించారు. వీరి ఇద్దరి వ్యాఖ్యలు వెనుక పెద్ద కుట్ర ఉందని, జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళగానే, ఉమ్మడి రాష్ట్రానికి సియం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పేర్ని నాని వ్యాఖ్యలను టిఆర్ఎస్ పార్టీ ఖండించలేదు అంటేనే, అర్ధం అవుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం మళ్ళీ జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, గత వారం రోజులుగా జరుగుతున్న విషయాలు వీటికి మూలం అని రేవంత్ అన్నారు. మరి ఇవి రాజకీయ ఆరోపణలేనా ? లేక నిజంగానే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? ఏమో మన రాజకీయ నాయకులు మామూలు వాళ్ళు కాదు మరి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read