వైసీపీ వ్యూహాలు బలే గమ్మత్తుగా ఉంటాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయటంలో వాళ్ళ స్టైల్ వేరు. ప్రజలను మాయ చేయటం, మభ్య పెట్టటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అన్ని చోట్లా అది కుదురుతుంది కానీ చంద్రబాబ దగ్గర అది కుదురుతుందా ? మొన్న స్థానిక సంస్థలను టిడిపి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా టిడిపి వదిలేసింది. టిడిపి వదిలేసినవి పట్టుకుని, పోటీ లేని చోట మేమే గెలిచాం అంటూ వైసీపీ డబ్బా కొట్టింది. చివకు కుప్పంలో కూడా మేమే గెలిచాం అని చంద్రబాబు పని అయిపొయింది అంటూ చేసిన హడావాడి అంతా ఇంతా కాదు. బ్లూ మీడియా చేసిన హడావిడి అందరూ చూసారు. చంద్రబాబు కుప్పంలోనే ఓడిపోతారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. త్వరలోనే కుప్పంలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి మొన్న జరిగిన ఎన్నికల్లో జరగలేదు. అయితే కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకి బలం లేదని, చిత్తుగా ఓడిస్తాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. ఇది చంద్రబాబ వరకు వెళ్ళింది. ఇక ఉపేక్షించేది లేదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. కుప్పం పర్యటన పెట్టుకున్నారు. విషయం ఉన్న వాళ్ళు, చిల్లర ప్రచారాలు చేయరు, వాళ్ళ పనితనంతోనే సమాధానం చెప్తారు.
అలాగే చంద్రబాబు కూడా తనకు ఎంత బలం ఉందొ కుప్పంలోనే చూపిస్తానని, కుప్పం పర్యటన పెట్టుకున్నారు. నిన్న చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టారు. సహజంగా చంద్రబాబు సభలకు ఒక పరిమిత స్థాయిలోనే ప్రజలు వస్తారు. నిన్న కుప్పం పర్యటనలో మాత్రం, ప్రజలు కదం తొక్కారు. కను చూపు మేరలో జనం జనం జనం తప్ప, మరొకటి కనిపించ లేదు. ఎటు చూసినా ప్రజలే. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రజలు విరగబడి వచ్చారు. కుప్పం ముద్దు బిడ్డ మా చంద్రబాబు అని చెప్పారు. విమర్శకులకు తనదైన శైలిలో చంద్రబాబు సమాధానం చెప్పారు. ఆ జనప్రభంజనం చూసిన వైసీపీ నేతలకు నోట మాట రాలేదు. నిజానికి కుప్పంలో వైసీపీకి క్యాడర్ లేదు. పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలను తోలుకుని వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ బలంతో, బుల్-డోజ్ చేసే ప్రయత్నం చేసారు. దీనికి చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రజాభిమానంతోనే సమాధానం చెప్పి, వైసీపీ ఫేక్ ప్రొపగాండాను క్షణాల్లో భగ్నం చేసారు.