జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖా సొంత జిల్లాలో, వైసిపీ నేతల దౌర్జన్యా కాండ పరాకాష్టకు చేరింది. ఇప్పటి వరకు ఈ రకం దౌర్జన్యాలు ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల మీద చేసే వారు, ఇప్పుడు ఏకంగా ఉన్నత స్థాయి సీనియర్ అధికారుల పై కూడా బెదరింపులకు దిగుతున్నారు. ఈ అధికారులు కూడా సామాన్య అధికారులు కాదు, ఉన్నత స్థాయి అధికారులు. నిన్న ఏకంగా పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషాను, కడప వైసిపీ నేతలు, రాజోలి వీరారెడ్డి, అలాగే ఈయన పరిశ్రమల శాఖ సలహాదారుడు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రాజోలి వీరారెడ్డి అనే వ్యక్తి ఏకంగా ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషాను బెదిరించారు. నీ అంతు చూస్తాను, నిన్ను లేపెస్తాను, నాకు సంబందించిన వ్యక్తి పాత బిల్లులు చేయమంటే, సబ్సిడీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమంటే, ఇవ్వకుండా జాప్యం చేస్తావా, నిర్లక్ష్యం చేస్తావా అంటూ ఆయన పై బెదిరింపులకు దిగారు. ఇది మా ప్రభుత్వం అని, మా మనుషులు, మా పార్టీ వాళ్ళు, అడిగితే, నేను సహాయకుడిగా ఉన్న శాఖలోనే నాకు సహకరించవా, నువ్వు నాకు సహాయం చేయను వద్దు, నాకు బిల్లులు ఇవ్వను వద్దు, నిన్ను చం-పే-స్తాం, నిన్ను చంపటమే నా లక్ష్యం అంటూ, ఏకంగా సీనియర్ అధికారి అయిన, పరిశ్రమల శాఖ జీఎం పై వైసిపీ నేతలు దౌర్జన్యం చేసారు.
దీంతో ఈ అరాచకాన్ని తట్టుకోలేక, వైసీపీ నేతల బెదరింపులకు లంగకుండా, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, మీడియా ముందుకు వచ్చి, మొత్తం విషయం బెదిరించారు. ఈ అరాచకం పై, ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. ఒక వైసిపీ నేత, ఉన్నతాధికారులను బెదిరించటం ఏమిటి, మరీ ఇంత దారుణమా అంటూ, ప్రజలు చర్చించుకుంటున్నారు. బిల్లులు కోసం, ఇంత బెదిరింపులకు దిగుతారా అని, ఏకంగా ఆఫీస్ కు వెళ్లి, ఆ అధికారినే చం-పే-స్తాం అని చెప్పటం వైసిపీ అధికార మదానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఉన్నతాధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక చిన్న స్థాయి ఉద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ దగ్గర డబ్బులు లేవు, సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు అని అతను జగన్ మోహన్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడారని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ, వైసీపీ నేత సమర్ధించుకున్నారు. మొత్తానికి, వైసిపీ అరాచకం స్వైరవిహారం చేస్తుందనే చెప్పాలి.