విశాఖ శారదా పీఠానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు, ఈ రోజు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఆ కధనాల ప్రకారం స్వరూపానందకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో, ఈ విషయం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. స్వరూపానంద అంటే జగన్ మోహన్ రెడ్డికి బాగా ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డిని గంగలో ముంచి, హిందూ ఓటర్లను ఆకర్షించటంలో స్వరూపానంద కృషి చేసారు. ఎన్నికల తరువాత జగన్ ని ఆకాశానికి ఎత్తేసారు. జగన్ గెలుపు కోసం పని చేసినట్టు ఆయనే చెప్పారు. మరి ఇంత చేసిన స్వామీజీ రుణం తీర్చుకోవటానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ఆయన పీఠానికి 15 ఎకరాల విలువైన భూమి ఇచ్చేందుకు, సెట్ అప్ మొత్తం సెట్ అయ్యింది. ఇప్పటికే కలెక్టర్ నివేదిక కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించటమే తరువాయి అని తెలుస్తుంది. ఇప్పటికే స్వరూపానందకు విశాఖలో పీఠం ఉంది. ఆ భూమి కూడా కొంత మేర ఆక్రమించుకున్న భూమి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వరూపానంద శిష్యుడే. ఆయన కూడా ఈ మధ్యనే ఆయన రుణం తీర్చుకున్నారు.
అత్యంత విలువైన కోకాపేటలో 2.34 ఎకరాల భూమి, దాదాపుగా 12 కోట్ల విలువైన భూమిని కేవలం రెండు రూపాయలకే ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న స్వరూపానంద పీఠం, ఇక పైన వేద పాఠశాల కూడా నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, పక్కన నది, చుట్టూ కొండలు ఉండే ప్రాంతం అయితే బాగుటుందని, విజయనగరం జిల్లాలో ఒక భూమి ఎంపిక చేసుకున్నారు. అక్కడ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలు పక్కన పెట్టి, డైరెక్ట్ గా కలెక్టర్ చేత నివేదిక ఇప్పించి, రేపు క్యాబినెట్ మీటింగ్ లో ఈ ఫైల్ వచ్చేలా చకచకా పావులు కదిపారు అంటూ ఆ కధనం సారంశం. అయితే అక్కడ మార్కెట్ వాల్యు రూ.50 లక్షల వరకు ఉందని, మరి స్వరూపానందకు ఎంతకు ఇస్తారు ? ఉచితంగా ఇస్తారా ? లేక కేసిఆర్ లాగా, ఎకరం రూపాయికి ఇస్తారా అనేది చూడాలి. ఈ విషయం పై ఇప్పుడు రాజకీయంగా కూడా రచ్చ అయ్యే అవకాసం లేకపోలేదు.