అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్తగా ఇచ్చేది ఏముంది, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు షాక్ ఇస్తూనే ఉన్నారు కదా అంటారా. పాపం ఏమి చేస్తారు. ఇన్నేళ్ళు ఉద్యమం చేసినా, ఎక్కడా కట్టు దాటకుండా ఉద్యమం చేస్తున్నారని అలుసో, లేక మరే కారణమో కానీ, వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం అన్నా కూడా, ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు. గతంలో చూసాం అనేక కార్యక్రమాలు చేస్తాం అని చెప్పినా, ప్రభుత్వం ఒప్పుకోకుండా రణరంగం సృష్టించింది. ఇప్పుడు కూడా అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న కార్యక్రమానికి అడ్డు తగిలింది ప్రభుత్వం. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తాం అంటూ, అమరావతి రైతులు పెట్టుకున్న వినతిని ప్రభుత్వం అంగీకరించ లేదు. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ అనుమతి నిరాకరిస్తూ లేఖ రాసారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు, దాదాపుగా 40 రోజులు పాటు, ఈ పాదయత్రని నిర్వహించాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి, ఈ పాదయాత్రకు నామకరణం చేసారు. అమరావతిలో ఉన్న హైకోర్టు, తిరుమల శ్రీవారి ఆలయం వరకు కూడా ఈ పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

amaravati 28102021 2

దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. రూట్ మ్యాప్ కూడా రూపొందించారు. ఈ నేపధ్యంలోనే తమకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి, అమరావతి రైతు పరిరక్షణ సమితి తరుపున, గద్దె తిరుపతి రావు లేఖ రాసారు. అయితే ఎన్ని రోజులు అయినా అనుమతి ఇవ్వక పోవటంతో, రైతులు హైకోర్టు తలుపు తట్టారు. ఈ విషయం పై ఈ నెల 28లోగా ఏదో ఒకటి తేల్చాలి అంటూ హైకోర్టు డీజీపీన ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే డీజీపీ ఈ రోజు లేఖ రాసారు. అనుమతి నిరాకరిస్తున్నాం అని తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, ఇతర ప్రాంతాల్లో సమస్యలు వస్తాయని, ఉద్రిక్త పరిస్థితులు తల ఎత్తే ప్రమాదం ఉందని, జాతీయ రహదారి వెంట ఈ పాదయాత్ర చేయటం మంచిది కాదని, అందుకే అనుమతి నిరాకరిస్తున్నాం అని డీజీపీ తెలిపారు. అయితే అమరావతి రైతులు దీని పై అభ్యంతరం తెలుపుతూ, రేపు దీని పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తాం అని, శాంతి యుతంగా చేసే పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read