వివేక కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఘటన జరిగింది వివేక ఇంట్లో, అదీ పులివెందులలో. అంత ధైర్యంగా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చి మరీ, ఆయనను హ-త్య చేసే ధైర్యం బయట వారికి ఉండదని అందరికీ తెలిసిన విషయమే. అనేక పేర్లు ప్రచారంలో ఉన్నా, సిబిఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి, అన్నీ బయటకు వస్తాయి అనే నమ్మాలి. ఇప్పటికే దస్తగిరి ఇచిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు అన్నీ ఉన్నాయి. ఎర్ర గంగి రెడ్డి వెనుక, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నట్టు చెప్పాడు.ఇది పెద్ద సంచలనం అవ్వటంతో, టిడిపి కూడా ఈ విషయం గట్టిగా పట్టుకుంది. అసలు చంద్రబాబు ఈ విషయం ఎత్తితేనే, దీనికి సమాధానం చెప్పలేక, ఆయన భార్య పై వ్యాఖ్యలు చేసారు. అయితే అదే రోజు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వివేక తన సొంత బాబాయ్ అని, ఎవరి పేరు అయితే అవినాష్ రెడ్డి అంటున్నారో, అతను ఇంకో బాబాయ్ కొడుకు అని, మా ఫ్యామిలీలో వ్యక్తిని, మా వేలుతో మేమే కంటిలో పొడుచుకుంటామా అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసలు వివేక కేసు విషయం చంద్రబాబు ఉన్న సమయంలోనే జరిగిందని, చంద్రబాబు దీని వెనుక ఉన్నారు అంటూ, అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసారు.

viveka 23112021 2

అయితే మీడియాలో వివేక కేసులో, అవినాష్ రెడ్డి పాత్ర పై ప్రముఖంగా వస్తూ ఉండటంతో, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. సాక్షాత్తు సాక్షిలో కూడా కొన్ని కధనాలు వచ్చాయి. గోర్ల భరత్ యాదవ్ అనే వ్యక్తి వివేక కేసు పై వ్యాఖ్యలు చేసారు అంటూ కధనాలు ప్రచురించారు. అందులో గోర్ల భరత్ యాదవ్ చెప్తూ, వివేక కేసు సూత్రధారి, ఏకంగా వివేక అల్లుడు రాజశేఖర్‍రెడ్డి అని చెప్పారు. వివేక ఆస్తి కోసమే, ఏకంగా అల్లుడే ఆయన్ను చం-పే-సా--డు అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు వివేక స్త్రీ లోలోడు అనే విధంగా, వివేకకు సన్నిహితంగా ఉండే షమీమ్‍కు, వివేక ఆస్తి మొత్తం దోచి పెడుతున్నాడని, అందుకే వివేక అల్లుడే ఈ పని చేసారు అంటూ, సాక్షి సహా, ఇతర వైసీపీ అనుకూల మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఏకంగా వివేక క్యారక్టర్ ని దెబ్బ తీస్తూ, వివేక కుమార్తె సునీత భర్త, ఈ హ-త్య చేసాడు అనే విధంగా, కధనాలు రాసారు. దీంతో ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా, ఈ ఎదురు దా-డి చేయటం వెనుక వ్యూహం ఏమిటి ? సిబిఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read