జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబు పై, రాళ్ళ దా-డి నేపధ్యంలో, ఒక్కారిగా టిడిపి శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. తిరుపతి ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దా-డి, తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలు అవ్వటం, తరువాత చంద్రబాబు నిరసన వ్యక్తం చేయటం, ఈ సంఘటనలు అన్నిటి నేపధ్యంలో, టిడిపి అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నేతృత్వంలో, ఒక ప్రతినిధి బృందం, అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగింది. గవర్నర్ ను కలిసి, ఈ రోజు జరిగిన ఘటన నేపధ్యంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు, పోలీసులు వైఫల్యం తదితర అంశాల పై ఆయనకు వివరించాలని, టిడిపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయం ద్వారా, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి అపాయింట్మెంట్ ఇస్తారా, లేదా రేపు ఉదయం గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా జెడ్ ప్లస్ లో ఉన్న చంద్రబాబుకే రక్షణ లేకపోతే, ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయం పై ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు ప్రచార సభలకు, ప్రచారానికి, ఇంటి ఇంటి ప్రచారానికి ముందే అనుమతి తీసుకున్నారు.
అయినా పోలీసులు నుంచి భద్రత అంతఅంతమాత్రంగానే ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా,జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న చంద్రబాబు పై, ముందుగా పర్మిషన్ తెసుకున్న, పోలీసులు రక్షణ కల్పించకపోవటం కారణంగానే ఈ ఘటన జరిగిందని టిడిపి ఆరోపిస్తుంది. అసలు ఇది ఎవరు చేసారు, చేయించింది ఎవరు అనే అంశం పై కూడా దర్యాప్తు జరపాలని, గవర్నర్ ను కలిసి కోరాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు జరగబోయే ఎన్నికలు కూడా కేంద్ర బలగాల మధ్య జరిపించాలని కూడా గవర్నర్ ను కోరనున్నారు. దీనికి సంబంధించి, అటు కేంద్రానికి, రాష్ట్రానికి కూడా తగు ఆదేశాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని, టిడిపి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తే, ఈ రోజే ఆయన్ను కలిసి వివరించాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. అపాయింట్మెంట్ విషయం పై, గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు ఇంకా జరుగుతున్నాయి.