మాకు ఢిల్లీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.. మేము తలచుకుంటే జడ్జిలనే మార్చేస్తాం. మేము ఏది చెప్తే ఢిల్లీ నేతలకు అదే ఫైనల్.. మేము ఏమి చేసినా మోడి, అమిత్ షా కు చెప్పే చేస్తాం అంటూ, వైసిపీ నేతలు తరుచు చెప్పే మాటలు ఇవి. జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి, నిజమే అని నమ్మే వారు కూడా ఉన్నారు. అయితే అందుకు బిన్నంగా, ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. ఇన్నాళ్ళు సోము వీర్రాజు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా, హేళన చేస్తూ వచ్చిన వైసీపీ పెద్దలు ఈ దెబ్బతో షాక్ తిన్నారు. ఏకంగా బీజేపీ జాతీయ్ అధ్యక్ష్యుడే ఇలా వాయించి పెట్టారు అంటే, ఢిల్లీ లెవెల్ లో జగన్ ప్రభుత్వం పై, ఢిల్లీ పెద్దలు ఏ అభిప్రాయంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గునటానికి, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా, తిరుపతి వచ్చారు. తిరుపతి నుంచి నెల్లూరు ప్రచారం సభలో పాల్గున్నారు. ఈ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అధికారంలోకి ఉన్న వైసీపీ ప్రభుత్వం, అవినీతిలో కూరుకుపోయిందని, మంచి పరిపాలన అందించటంలో జగన్ విఫలం చెందారని అన్నారు. ఈ ప్రభుత్వం అవినీతి మయం అని, బంధు ప్రీతి ఎక్కువ అయ్యిందని అన్నారు.
అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందకు పైగా దేవాలయాల పై దా-డు-లు జరిగాయని అన్నారు. ఇన్ని జరిగినా, వాటి పై చర్యలు ఏమి తీసుకోకుండా, మరిన్ని సంఘటనలు జరగకుండా చేయటంలో విఫలం అయ్యారని అన్నారు. ఇది సెక్యులర్ ప్రభుత్వం కాదని అన్నారు. ఇక్కడ స్టేట్ స్పాన్సర్డ్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా ఒక మతానికి సంబందించిన వారికి జీతాలు ఇస్తున్నారు అంటే, ఏమని చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ఒక మతానికి జగన్ మోహన్ రెడ్డి కొమ్ముకాస్తున్నారని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ లో లేని అవినీతి అంటూ లేదని అన్నారు. ఇసుక లో అవినీతి, మద్యంలో అవినీతి, భూముల్లో అవినీతి, పోర్టులలో అవినీతి, ఇలా ప్రతి రంగంలో అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నారని అన్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువత, విపరీతంగా అప్పులు చేసారని, ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి, చివరకు వాటిని ఆదాయం పెంచుకునే మార్గంలో కాకుండా, పంచిపెడుతున్నారని వాపోయారు. అయితే, ఇన్ని తెలిసినా కేంద్ర పెద్దలు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.