ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడం పై, టిడిపి ఏపి అధ్యక్ష్యుడు, కింజారపు అచ్చెన్నాయుడు జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో " ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్ సంస్థకు అప్పజెప్పడంలోనే జగన్ రెడ్డి కుట్ర బహిర్గతమైంది. అమూల్ సంస్థకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాష పై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన సంస్థ కోసం రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన సంగం డైయిరీని నాశనం చేస్తున్నారు. ఇక్కడ సంపదను పొరుగు రాష్ట్రాల సంస్థలకు అప్పనంగా అప్పజెబుతున్నారు. దురుద్దేశంతో మొదటి నుంచీ సంగం డైయిరీని దెబ్బతీసి అమూల్ కు ధారాదత్తం చేయాలని కుట్ర పన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. సంగం డైయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఏవిధంగా జీరో జారీ చేస్తుంది? రైతులకు మేలు చేయడమే సంగం డైయిరీ చేసిన నేరమా? సంగం డైయిరీ రైతులకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ధూళిపాళ్ల నరేంద్ర జ్వరంతో బాధపడుతున్నా జగన్ రెడ్డి కనికరించడం లేదు. ధూళ్లిపాళ్ల నరేంద్ర ప్రాణాలకు ప్రభుత్వానికే బాధ్యత. "

amul 05052021 2

"అమూల్ కు పాలు రాకపోవడంతో కక్షగట్టారు. లోపాయికారీ ఒప్పందాలతో గుజరాత్ కు చెందిన అమూల్ కు ఇక్కడి పాలను కట్టబెట్టే కుట్రకు పాల్పడ్డారు. సంగం డైయిరీ విషయంలో వైఎస్ సుప్రీంకోర్టు వరకు వెళ్లినా న్యాయం సంగం డైయిరీ వైపే ఉంది. అమూల్ కోసం జగన్ రెడ్డి దురుద్దేశంతో రైతు ఆర్గనైజేషన్ ను విధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయం? ఎలాంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా సంగం డైరీ ఛైర్మన్ ను అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 100 మంది పోలీసులతో వచ్చి అరెస్ట్ చేశారు. అమూల్ కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో కక్ష సాధించడానికే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం పాల సహకార సంఘాలను, ప్రైవేట్‌ డెయిరీలను ముంచుతున్నారు. నిజంగా పాడిరైతులకు మేలు చేయాలనుకుంటే ఇక్కడి సహకార సంఘాల ద్వారానే చేయొచ్చు. ఆ పని ఎందుకు చేయడం లేదు? లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామనే ఎన్నికల హామీ నెరవేర్చలేదు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం, ఆర్థికంగా దెబ్బతీసేందుకు మొత్తం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారు. జగన్ రెడ్డి భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారు." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read