ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కొత్త పరిశ్రమలు రాక పోగా, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. అయితే దీనికి కొన్ని సార్లు ప్రభుత్వ వైఖరి కూడా కారణం అవుతుంది. నిబంధనల పేరుతో, వారు కొన్ని పరిశ్రమలను ఏకంగా మూసివేయమని చెప్పటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఏదైనా ఇబ్బని ఉంటే, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కానీ, ఇక్కడ ఏకంగా కంపనిని మూసివేయమని ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆ కంపెనీ యజమనాలు కంటే, అక్కడ పని చేసే కార్మికులే ఈ చర్యలతో ఎక్కువ నష్టపోతారు. అసలకే ఈ క-రో-నా కాలంలో ఏమి చేయలేని పరిస్థితి. ఉన్న ఉద్యోగులు కూడా పొతే, వారు ఏమవుతారో కూడా ఆలోచన లేకుండా, ప్రభుత్వం ఈ సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో, అంటే పది రోజులు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. అందులో ఒకటి కడపలో ఉన్న జువారి సిమెంట్స్ మూసివేయమని చెప్పటం, రెండోది చిత్తూరులో ఉన్న అమరరాజా బ్యాటరీస్ కంపెనీని మూసివేయమని చెప్పటం. రెండిటిలోనూ, వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జువారి సిమెంట్స్ లో దాదాపుగా 7 వేల మంది పని చేస్తుంటే, అమర రాజా కంపెనీలో 15 వేల మందికి పైగా పని చేస్తున్నారు.

zuari 05052021 2

ఈ కంపెనీల పై ఆధార పడి ఉన్న అనుబంధ సంస్థలు అదనం. అయితే ప్రభుత్వ నిర్ణయం పై, ఈ కంపెనీలు న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యాయి. ఇందులో జువారి సిమెంట్స్ ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరింది. దీంతో పిటీషన్ ని పరిశీలించిన హైకోర్టు, జువారి సిమెంట్స్ కంపని మూసివేత ఆదేశాలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాలుష్య నియంత్రణ బోర్డు సూచనలకు మేరకు ఏప్రిల్ 24 కంపెనీ మూసివేయాలని ఆదేశాలు వెళ్ళాయి. అయితే ఈ విషయం పై హైకోర్టు స్పందిస్తూ, కాలుష్య మండలి ఇచ్చిన సూచనలు, ఈ నెల 31 లోపు అమలు చేయాలని జువారి సిమెంట్స్ కు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు పాటిస్తూ, కంపెనీ నడుపుకువోచ్చని హైకోర్టు చెప్పింది. అయితే 31 లోపు మాత్రం, పొల్యూషన్ బోర్డు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని షరతు పెట్టింది. దీంతో జువారి సిమెంట్స్ కు, అక్కడ పని చేసే కార్మికులకు ఊరట లభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read