అందరూ అనుకున్నట్టే జరిగింది. గతంలో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తరువాత క-రో-నా రావటం, ఆ తరువాత నలంద కిషోర్ అనే మరో టిడిపి నాయకుడిని విచారణ పేరుతో తీసుకుని వెళ్లి, తరువాత క-రో-నా సోకి , ఆయన చనిపోవటం తెలిసిందే. ఇప్పుడు మరో టిడిపి నేత, సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకి కూడా క-రో-నా సోకోంది. ఆయన పై సంగం డైరీ కేసులో ఆరోపణలు మోపి గత పది రోజులుగా జైల్లో ఉంచారు. ఎవరైనా విచారణ చేసి అరెస్ట్ చేస్తారు కానీ, ఇక్కడ మాత్రం ఆరోపణలు మోపి , అరెస్ట్ చేయటం ఆనవాయితీ అయిపొయింది. కోర్టులో పిటీషన్ వేసి, బెయిల్ తెచ్చుకోవటానికి సమయం పడుతూ ఉండటం, చివరకు కోర్టులో ఆధారాలు ఏమి చూపలేక పోవటం వారికి బెయిల్ రావటం, నిత్య కృత్యం అయిపొయింది. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర క-రో-నా బారిన పడ్డారు. ఆయనకు క-రో-నా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా ధూళిపాళ్ల నరేంద్ర క-రో-నా లక్ష్యణాలతో బాధ పడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, ఏసిబి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. వెంటనే ఆయనకు చికిత్స అందించాలని కోరారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారని, ఆయనను ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించాలని కోరారు.
అయితే ఏసిబి కోర్టులో, ఏసిబి తరుపు లాయర్ అడ్డుపడ్డారు. అవసరం లేదు అని చెప్పటంతో, అఫిడవిట్ రూపంలో ఇవ్వమని ఏసిబి కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు ధూళిపాళ్ల నరేంద్ర వేసిన క్వాష్ పిటీషన్ హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంలో, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అనే విషయం హైకోర్టు దృష్టికి తెచ్చారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు పాజిటివ్ వచ్చిందని, ధూళిపాళ్ల నరేంద్రకు లక్ష్యనాలు ఉన్నాయని, వెంటనే వారిని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధూళిపాళ్ల నరేంద్రకు లక్ష్యానాలు ఉంటే, ఆయన్ను వెంటనే ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకోపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయాని హెచ్చరించింది. అయితే సాయంత్రానికి ఆయనకు పాజిటివ్ అని తేలటంతో, ఆయన్ను ఇప్పుడు ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకు వెళ్ళటానికి పోలీసులు సిద్ధం అయ్యారు. ఏది ఏమైనా, చేయని నేరానికి, కేవలం ఆరోపణలు చేసి, ఇలా ఆయన్ను ఇబ్బందులు గురి చేయటం పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.