ఒక పక్క రాష్ట్రంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. అంతం అనేది లేకుండా, కరోనా పాకుతుంది. రోజు మన కళ్ళ ఎదుటే అనేక ఘోరాలు చూస్తున్నాం. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు లేక, ఆక్సిజన్ లేక, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఉన్నా, అది అందరికీ అందుబాటులోకి రాలేదు. దీనికి నివారణ తప్ప, ప్రస్తుతానికి మందు అయితే లేదు. ఈ పరిస్థితిలో అందరూ చెప్పేది ఒక్కటే. మాస్కు పెట్టుకోమని. మాస్కు ధరించి, కాపాడుకోమని, ఇతరులను కాపాడమని. ప్రభుత్వాలు కూడా, మాస్కు ఆవస్యకత గ్రహించి, మాస్కు వేసుకోవటం పై అవగాహన కలిగిస్తున్నాయి. మాస్కు వేసుకుంటేనే బయటకు రావాలని, మాస్కు లేని వారికి జరిమానా కూడా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టే బయటకు మాస్కు లేకుండా వస్తే చాలు, వారి పై ప్రభుత్వం విరుచుకు పడుతుంది. ఎక్కడికక్కడ ఫైన్స్ వేస్తుంది. ప్రజలు కూడా దారిలో పడ్డారు. అయితే ప్రభుత్వాధి నేత అయిన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, ఆయన పంధాలోనే ఆయన వెళ్తున్నారు. మొదటి నుంచి మాస్కు అతి తక్కువగా పెట్టుకునే జగన్ గారు, ఇప్పుడు కూడా, ఈ విపత్కర పరిస్థతిలో కూడా, మాస్కు లేకుండానే, రివ్యూ మీటింగ్లకు, క్యాబినెట్ మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు.
పోనీ ఈ మీటింగ్స్ ఏమైనా, ఆన్లైన్ లోనా, లేదా అతి తక్కువ మంది ఉండే మీటింగా అంటే కాదు. ఏకంగా 20, 30 మందికి పైగా ఉండే మీటింగ్. వీరందరూ వ్యాక్సిన్ లు వేసుకుని ఉండవచ్చు, పోనీ అందరికీ టెస్ట్ చేసి జగన్ గారి దగ్గరకు పంపించి ఉండవచ్చు కానీ, ఇలా ఒక ముఖ్యమంత్రి , ఈ సమయంలో మాస్కులు లేకుండా కనిపించి ఏమి సందేశం ఇస్తున్నారు ? ఇదే నిన్న ఒక విలేఖరి, మంత్రి పేర్ని నానిని అడిగారు. క్యాబినెట్ బ్రీఫింగ్ గురించి పేర్ని నాని,మీడియా ముందుకు రాగా, ఆయన్ను ఇదే విషయం అడిగారు. దానికి మంత్రి గారు స్పందిస్తూ, జగన్ గారు మాస్కు ఎందుకు పెట్టుకోవటం లేదు అంటే, ఆయన మాట్లాడే మాటలు వినిపించవు కాబట్టి పెట్టుకోలేదు అంట. మిగతా అందరూ మాస్కు పెట్టుకోక పొతే ఇబ్బంది కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడే సమయంలో, మాస్కు పెట్టుకుంటే వినపడదు అని, మాస్కు పెట్టుకోలేదు అంటూ కవరింగ్ ఇచ్చారు. అసలు ఇదేమీ సమాధానమో అర్ధం కాలేదు. ఆయన మాట్లాడే సమయంలో తీస్తే అది వేరే విషయం కానీ, అసలు ఆయన మాస్కే పెట్టుకోకుండా కనిపిస్తున్నా, మంత్రి గారు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసారు.