ఏసిబి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ రాజమండ్రి జైల్లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, అలాగే సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. మొన్న రాజమండ్రి నుంచి విజయవాడ ఏసిబి ఆఫీస్ కు తీసుకు వెళ్లి, మళ్ళీ రాజమండ్రి తీసుకురావటం జరిగింది. అయితే నిన్నటి నుంచి సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురు అయ్యింది. అయితే ఆయనకు పరీక్షలు చేపించగా క-రో-నా గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు సిటి స్కాన్ చేయటానికి రాజమండ్రి కో-వి-డ్ హాస్పిటల్ కు పంపించగా, అక్కడ సిటి స్కాన్ పని చేయక పోవటంతో, ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే, ధూళిపాళ్ల కూడా అస్వస్థతకు గురి కావటంతో, అందరూ ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నారు. అయితే ఆయన టెస్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను వెంటనే మంచి ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్ళి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఏసిబి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

dhulipalla 04052021 2

ధూళిపాళ్ల నరేంద్రకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయన జ్వరంతో బాధ పడుతున్నారని, ఇప్పుడున పరిస్థితిలో ఆయనకు వెంటనే వైద్యం అందించాలని, ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం అందించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. అయితే అనూహ్యంగా ఏసిబి తరుపున ఉన్న పీపీ, ఆయనకు ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం అందించే అంశం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమకు కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావలని కోర్టు ని కోరారు. అయితే ఏసిబి తీరు పై తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. కావలని కో-వి-డ్ కేసులు ఉన్న జైల్లో బంధించారని, వాళ్ళు నేరస్తులు కారని, విచారణ కోసం అని చెప్పి, ఇప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నా సాగదీస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఏ హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి ఆవేదన వ్యక్తం చేసారు. మరో పక్క ఇదే అంశం పై, నారా లోకేష్ కూడా స్పందించారు. వారి ఆరోగ్యం క్షీణిస్తే బాధ్యత మొత్తం జగన్ రెడ్డిదే అని, వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read