క-రో-నా ఉధృతి రోజురోజుకీ ఎక్కువవుతోందని, నిన్నకూడా దేశ వ్యాప్తంగా 3లక్షల70వేలకు పైగా కేసులు నమోదయ్యా యని, మన రాష్ట్రంలో 24వేలకు పైగా గుర్తించారని, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా భారత్ లోనే నమోదవడం ఆందోళనకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "ఇలాంటి క్షిష్టపరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాలంటే వ్యాక్సినేషనే ముఖ్యం. వ్యాక్సినేషన్ గురించి రెండ్రోజుల క్రితం మాట్లాడాను. రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ , ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టే ఆలోచనలో ఉన్నాయని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సిన్ల పైనే ఆధార పడకుండా అనేక రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తు న్నాయి. మనరాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎందుక ప్రయత్నాలు చేయడంలేదు? 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్లు ఇవ్వాలంటే, రూ.1600కోట్ల వరకు ఖర్చవుతుంది. ఆ మాత్రం సొమ్ముకూడా ఖర్చుపెట్టలేని స్థితిలో ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉన్నాయా అని రెండ్రోజు ల క్రితమే మీడియా సాక్షిగా నిలదీశాను. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టాలంటే ఈ ప్రభుత్వం రూ. 5 నుంచి రూ. 6వేలకోట్ల వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఆ మాత్రం నిధులుకూడా ఈ ప్రభుత్వానికి అందుబాటులో లేవా? రాష్ట్రం అంత లాదివాలా తీసిందా? ఒక వేళ దివాలా తీసుంటే, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి, ప్రభుత్వంచేస్తున్న దుబారాఖర్చే కారణం. ముఖ్యమంత్రి ఎంతలా దిగజారిపోయాడంటే, ఉద్యోగస్తుల జీతాలకు కోతపెట్టి, వ్యాక్సిన్లు అందిస్తానంటున్నాడు. ప్రజలందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఉద్యోగుల జీతాలకు కోతపెడతాడా? అస్సలు ఏమైనా సిగ్గుందా ఈముఖ్యమం త్రికి? ఒకపక్కన ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తాననిచెప్పి, ఇప్పుడేమో ఉద్యోగుల జేబులుకొట్టేసి వ్యాక్సిన్లుఇస్తామని చెబుతున్నాడు.
విద్యుత్ శాఖలో ఉన్న ఏపీ డిస్కమ్ లకు సంబంధించిన సీఎమ్ డీలు ఇచ్చిన సర్క్యులర్ ఒకసారి పరిశీలిస్తే, ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ ని 27-04-2021న ఇచ్చారు. దానిలో ఏముందయ్యా అంటే, డిస్కమ్ ల పరిధిలో ఉన్న ఉద్యోగలందరి ఒకరోజు జీతాన్ని వ్యాక్సినేషన్ కోసం కట్ చేస్తున్నట్లు, అందుకోసం ఉద్యోగులంతా వారి సమ్మతి ని తెలియచేశారని ఉంది. కానీ వాస్తవానికి ఏ ఒక్క ఉద్యోగిని సంప్రదించలేదు. వారెవరూ కూడా వారి సమ్మతి తెలియ చేయలేదు. ఉద్యోగుల జేఏసీ వారు ఏప్రియల్ 28న ఒక లేఖ రాశారు. తామేమీ తమసమ్మతిని తెలియచేయలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని, జీతాలు కట్ చేయడానికి ఒప్పుకోమని లేఖలో పేర్కొన్నారు. క-రో-నా సమయంలో ఉద్యోగులందరూ కూడా వారిప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. అటువంటివారి జీతాల్లో కోత పెట్టడమేంటి? అసలు ఈముఖ్యమంత్రి మనిషేనా? ఉద్యోగుల జీతాలకు కోతపెట్టి వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పడమేంటి? ఇచ్చిన సర్క్యులర్ పై ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి కోతపెట్టాల్సింది ఉద్యోగులజీతాల్లో కాదు. మద్యంపై, ఇసుకపై, ఇతరత్రాదందాల రూపంలో ముఖ్యమంత్రికి వస్తున్న సొమ్ములో ఆయన కోతపెట్టుకో వాలి.
ఆ విధంగా ఆయన తనకు వచ్చే సొమ్ముని, కమీషన్లను కట్ చేసుకుంటే, రాష్ట్రంలోఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఏరాష్ట్రంలోనైనాసరే ఇటువంటి దిక్కుమాలిన సర్క్యులర్లు ఇచ్చారా? ఉద్యోగస్తుల జీతాల్లో కోతపెట్టి వ్యాక్సినేషన్ చేస్తామని ఏ రాష్ట్రమైనా నిర్ణయం తీసుకుందా? ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏవిధంగా దివాలా తీయించాడో, చివరకు వ్యాక్సినేషన్ కోసం ఉద్యోగులజీతాలకు కోతపెట్టాలని చూస్తున్నాడో ప్రజలంతా ఆలోచించాలి. ఉద్యోగుల జీతాలకు కోతపెట్టికాదు. తక్షణమే వ్యాక్సిన్లు కొని, ముఖ్యమంత్రి ప్రజలకు అందించాలని టీడీపీ తరపును డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే ఈ విషయంపై న్యాయపరంగా అయినా పోరాటంచేస్తామని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగస్తుల జీతాలకు కోతపెట్టి వ్యాక్సిన్లు కొనాలనే దిక్కుమాలిన ప్రణాళికలకు ముఖ్యమంత్రి వెంటనే స్వస్తిచెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.