తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఈ రోజు సిఐడి విచారణకు హాజరు అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో మార్ఫింగ్ చేసారు అంటూ, దేవినేని ఉమా పై కేసు పెట్టారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి 2014లో మాట్లాడుతూ, తిరుపతిలో ఉండటానికి ఎవరు ఇష్టపడతారు అంటూ, తిరుపతిని కించపరిచేలా మాట్లాడిన ఆడియోకి, జగన్ మోహన్ రెడ్డి తాజా క్లిప్పింగ్స్ వేసి చూపించారు. ఆయన చెప్పింది వాస్తవమే కాని, వీడియో మాత్రం తప్పుగా ఉండటం, మార్ఫింగ్ కేసు పెట్టారు. ఈ రోజు సిఐడి విచారణకు ఉమా హాజరు అయ్యారు. దాదాపుగా, 9 గంటల పాటు ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు, సిఐడి ఆఫీస్ లోనే ఉన్నారు. బయటకు వచ్చిన దెవినేని ఉమా, సిఐడి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వీడియో, చంద్రబాబు చేపించాడు, ఆయన పెట్టించాడు అని చెప్పు అంటూ, తన పై సిఐడి ఒత్తిడి తెచ్చింది అని, అలా చెప్తే తనను వదిలేస్తారు అంటూ, చెప్పారు అంటూ, దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుని కూడా ఈ కేసులో ఇరికించే కుట్రలో భాగంగా ఇది చేసారు అంటూ, దేవినేని ఉమా సిఐడి పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే, దేవినేని ఉమా ఆరోపణలు పై, ఇప్పటి వరకు అయితే సిఐడి ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
దేవినేని ఉమా మాటల్లోనే "నేను మీడియా ముందు మాట్లాడితే, దాన్ని పట్టుకుని, చంద్రబాబు నాయుడు చేపించాడు అని చెప్పు. తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పు అంటూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సతాయిస్తూ కూర్చుకున్నారు. మళ్ళీ 1 వ తారీఖు ఉదయం రమ్మన్నారు. మే డే అని కూడా మర్చిపోయారు అనుకుంటా. ఉదయం పది గంటలకు రమ్మన్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళు అడిగినవి తెచ్చి ఇవ్వాలి అంట. నేను మీడియా సమావేశంలో, జగన్ మాట్లాడిన వీడియో ట్యాబ్ లో చూపించాను కాబట్టి, ఆ ట్యాబ్ రేపు ఉదయం తెచ్చి ఇవ్వమన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇదే కుట్రలు కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి. పొద్దున్న నుంచి చూస్తా ఉన్నా, వీరి అరాచకాలు. జగన్ మోహన్ రెడ్డి గారు, తప్పుడు కేసులు బనాయించి, తప్పుడు కేసులు పెట్టి, మా గొంతు నొక్కాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం, మేము తగ్గుతాం అనుకోకండి. మీ దురాగతాలు ఇంకా గట్టిగా ఎండగడతాం. మీరు క్యాబినెట్ మీటింగ్ కి బయటకు రాలేరు కాని, ప్రజలు, పిల్లలు బలి అవ్వాలా ?" అని దేవినేని ఉమా అన్నారు.