అమరావతి అంటే మరణం లేనిది అని అర్ధం. అలాంటి అమరావతిని నిర్వేర్యం చేయటానికి , గత రెండేళ్లుగా పాలకులు చేస్తున్న ప్రయత్నం ఫలించలేదు. అమరావతిని మూడు ముక్కలు చేసి, విశాఖ వెళ్ళిపోవాలని, ప్రభుత్వం పన్నిన ఆలోచన , ఇప్పటికీ కార్య రూపం దాల్చలేదు. ఇది ఆ నేల మహిమో, పేరు మహిమో కానీ, పలువురు చెప్తున్నాట్టు, అమరావతిని రాజధాని కాకుండా చేయటం ఎవరి తరం కాదు అని చెప్తున్న మాటలు నిజం అవుతున్నాయి. అమరావతిని మూడు ముక్కులు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత, అమరావతి రైతులు, మహిళలు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికి 500 రోజులుగా సుదీర్ఘంగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా, ఎండ అయినా, వాన అయినా, క-రో-నా అయినా, ఏది అయినా సరే, ఉద్యమం ఆపలేదు. వారి సంకల్ప బలం ఎంత గొప్పదో చెప్పేందుకు, ఇది ఒక్కటి చాలు కదా. ఒక పక్క ఉద్యమం చేస్తూనే, మరో పక్క న్యాయ పోరాటం కూడా మొదలు పెట్టారు. అయితే ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. గత చీఫ్ జస్టిస్ హాయాంలో మొదలైన ఈ కేసు, చీఫ్ జస్టిస్ మారటంతో, మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వేసవి సెలవలు తరువాత, మళ్ళీ కేసు వాదనలు కోర్టు వినే అవకాసం ఉంది. ఇప్పటికి రెండేళ్ళు అయినా, అమరావతిని ఇంచ్ కూడా కదపలేక పోయారు.
ఇలా అమరావతి ఉద్యమం నేటికి 500 రోజులుకు చేరుకుంది. అమరావతి పై అనిశ్చితి నేలకోనటంతో, ఎవరూ పెట్టుబడులు పెట్టటం లేదు, సంస్థలకు ఇచ్చిన భూమిలో భావనాలు కట్టటం లేదు. ఈ తరుణంలో, కేంద్ర సంస్థ ఒకటి, అమరావతి రైతులు ఆశలు చిగురించే విధంగా, మంచి వార్త చెప్పింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తమ పరిపాలన భవనానికి అమరావతిలో శంకుస్థాపన చేసారు. ఆ సంస్థ డైరెక్టర్ కైలాష్‌చంద్ర అమరావతి వచ్చి, భూమి పూజ చేసారు. తుళ్ళూరులో ఆ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో, ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంస్థ కోసం, గత ప్రభుత్వం రెండు ఎకరాలు ఇచ్చింది. ఒక పక్క అమరావతి పై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలోనే, ఇలా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందుకు వచ్చి, తమ భవనం నిర్మాణం చేయటం పలువురుని ఆశ్చర్య పరుస్తుంది. ఈ పరిణామంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి చాలా రోజులు తరువాత, ఇది ఒక మంచి వార్తగా వారు అభివర్ణిస్తున్నారు.