ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా కి అంతం లేకుండా పోయింది. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ వెళ్తున్నాయి. ఒక్కసారిగా కేసులు సంఖ్య అధికారికంగానే భారిగా పెరిగింది. పోయిన వారం పది వేలు ఉన్న కేసులు, ఈ వారం 14 వేలకు చేరుకున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన కేసులు కొత్తగా 17,354. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని కేసులు రావటం ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఇన్ని ఎక్కువ కేసులు ఇప్పటి వరకు మనకు రాలేదు. 24 గంటల్లో 17,354 కేసులు రావటం చూస్తుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుంది. ఈ మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని వదిలి వెళ్ళేలా లేదు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం అని చెప్తున్నా, వ్యాప్తి విపరీతంగా జరుగుతుంది. మరో పక్క ఆంక్షలు పెద్దగా లేకపోవటంతో, ప్రజలు బయట తిరుగుతూ ఉండటంతో, కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలాగే మరణాలు కూడా 24 గంటల్లో 64 వచ్చాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 11,01,690 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం 7,992 మంది మరణించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1,22,980 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అన్నిటికంటే ఆందోళన కలిగించే అంశం పాజిటివిటీ రేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 20 శాతం పైగా ఉండటం ఆందోళన కలిగించే అంశం లా ఉంది.
ఈ రోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో , 2764 కేసులు వచ్చాయి. తరువాత స్థానంలో గుంటూరు, అనంతపురం, తూర్పు గోదావారి, శ్రీకాకుళం, విశాఖ ఉన్నాయి. అన్నిటికంటే తక్కువగా ప్రకాశం ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ కేసులు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా టెస్టింగ్ ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ వస్తే కేసులు మరింతగా పెరుగుతాయి. అలాగే అందరూ అంచనా వేస్తున్నాట్టు, మే నెలలో, కేసులు విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రాను రాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో, ప్రభుత్వం ఎలా ఇబ్బందులు లేకుండా చూస్తుందో చూడాలి. అన్నిటికంటే కలవర పెట్టే అంశం పరీక్షలు. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ, ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్తుంది. దీంతో ఇప్పుడున్న పరిస్థితిలో పరీక్షలు ఎలా రాయాలి అనే టెన్షన్ లో పిల్లలు ఉన్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం ఎలా హ్యండిల్ చేస్తుందో, ఏంటో చూడాలి.