ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక్కసారి ఏబి వెంకటేశ్వర రావు పై క్రమశిక్షణా చర్యలు ఉపక్రమించింది. ఐపిఎస్ గా ఉంటూ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, ఏబి వెంకటేశ్వర రావు వ్యాఖ్యలు చేసారు అనే అభియోగంతో, ఆరు పేజీలతో కూడిన ఒక జీవోని చీఫ్ సెక్రటరీ ఒక గంట క్రితం విడుదల చేయటం జరిగింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ అనంతరం, విచారణ పూర్తయిన సందర్భంగా, ఆయన మీడియాతో సచివాలయంలో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన కొంత మందిని ఉద్దేశిస్తూ, అల్పులు, కుక్క మూతి పిందెలు అంటూ, పరుష పదజాలం ఉపయోగించారని, ప్రభుత్వాన్ని కార్నర్ చేసారని చెప్పి, ఆయన పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ తరువాత, ఆయన మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు, ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొనటం జరిగింది. 30 రోజుల్లో దీని పై ఆయన సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో, చర్యలకు ముందుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆయన పై, నిఘా పరికరాల కొనుగోళ్ళలో అక్రమాలు అంటూ, అసలు కొనుగోళ్ళు జరగని చోట, ఆరోపణలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై విచారణ సందర్భంగానే, ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం, ఈ వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం, అంటూ జీవోలో తెలిపారు.
దీనికి సంబంధించి మొత్తం ఆరు పేజీలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో ఆయన మాట్లాడిన మాటలు, తెలుగులో పెట్టారు. ఇలా తెలుగులో పెట్టటం చాలా అరుదు. అయితే, ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు కూడా పెట్టారు. ముఖ్యంగా ఆయన అల్పులు, అధములు, కుక్క మూతి పిందెలు, చట్టాల పై అవగాహన లేని వారు, తన పై ఆరోపణలు చేసారని, ఆయన చెప్పిన మాటలకు , ప్రభుత్వ పెద్దలు నోచ్చుకున్నట్టు అర్ధమవుతుంది. అలాగే తన పై కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ లు సృష్టించారు అంటూ డీజీపీ, సిఐడి, ఏసిబి చీఫ్ ల పై, ఆధారాలను చీఫ్ సెక్రటరీకి కూడా సమర్పించారు. దీని పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని కూడా కోరారు. ఇదే సమయంలో వివేక కేసుకి సంబంధించి, సిబిఐకి రాసిన లేఖ విషయంలో కూడా, అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వానికి తెలియ చేయాల్సిన అంశాలు, ప్రభుత్వ పరువు తీసే విధంగా, మీడియా ముందు విడుదల చేయటం పై, ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.