తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు, భారత దేశ ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసింది. అధికార పార్టీ తీరుతో ప్రజలు షాక్ అయ్యారు. ఎవరు ఏమి అనుకుంటే మాకేం, మా మాటే శాసనం, మా చేతలు ఎవరూ ఆపలేరు అనే విధంగా, వారు వ్యవహరించిన తీరు, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడైనా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయాలి అంటే, ఒకటి అరా ఓట్లు వేయటానికి కూడా, అభ్యర్ధులు హడలి పోతారు. ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని, షాక్ అవుతారు. అయితే ఇక్కడ మాత్రం, ఒకటి , పది, వంద కాదు, వేలల్లో జనాలను దింపారు. ఏదో ర్యాలికి వస్తున్నట్టు, ఏదో సభకు వెళ్తున్నట్టు, బస్సుల్లో తరలించారు, కళ్యాణమండపాలు, అపార్ట్ మెంట్లలో బస ఏర్పాటు చేసారు, భోజనాలు వండించారు, ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లు వేయించారు. వాళ్ళు బస ఏర్పాటు చేసింది కూడా మంత్రి, ఎమ్మెల్యేలకు సంబందించిన కళ్యాణమండపాల్లోనే. ఇంత ధైర్యంగా వ్యవహారం నడిపించారు. ఇవన్నీ ప్రతిపక్షాలు, మీడియా ప్రజలు ముందు ఉంచాయి. దాదాపుగా ఒక 50 వరకు వీడియోలు, బయటకు వచ్చయి. లైన్ లలో ఉన్న వారిని అడిగితే, తమ ఇల్లు ఎక్కడో తెలియదు, తమ తండ్రి ఎవరో తెలియదు, తమ భర్త ఎవరో తెలియదు, ఇలా అనేకం మనం మన కళ్ళతో చూసాం.
అయితే ఇదే విధంగా నిన్న ఉదయం నుంచి , వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఆడియోలో, అవతల వైపు ఉన్న వైసీపీ నేత, దొంగ ఓట్ల కోసం, జనాలని తరలించే విషయం పై మాట్లాడారు. ఇటు వైపు ఉన్న చెవిరెడ్డి, అంత ఉదయమే అన్ని బస్సుల్లో వారిని తరలించటం కరెక్ట్ కాదని, 400 ఓట్లేగా మేము ఇక్కడ మ్యానేజ్ చేస్తాం అంటూ, ఆయన మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇప్పటి వరకు, అంటే రెండు రోజులు అవుతున్నా, చెవిరెడ్డి ఆ ఆడియో విషయం పై ఖండించలేదు. ఆయన మౌనం దేనికి సంకేతమో అర్ధం కావటం లేదు. సహజంగా రాజకీయ నాయకులు వెంటనే ఇలాంటివి ఖండిస్తారు. అయితే ఇక్కడ చెవిరెడ్డి మాత్రం ఖండించలేదు. ఇక్కడ మరో ప్రచారం ఏమిటి అంటే, ఆ ఆడియో లీక్ చేసింది వైసీపీ వారే అని. అయితే చెవిరెడ్డి, లేకపోతే అవతల మాట్లాడిన వైసీపీ నేత , ఇది బయటకు వదలాలి. మరి ఇది ఎవరు బయటకు వదిలారో తెలియదు కానీ, దీని పై ఇప్పటి వరకు చెవిరెడ్డి స్పందించక పోవటం, దేనికి సంకేతమో మరి.