వివేక కేసు విషయంలో, రోజుకి ఒక వార్త, గత నెల రోజులు నుంచి చోటు చేసుకుంటుంది. వివేక కుమార్తె సునీత ఢిల్లీ వెళ్లి, నాకు న్యాయం చేయండి అంటూ, బహిరంగంగా వేడుకున్న దగ్గర నుంచి, ఈ కేసు రోజు వార్తల్లోకి వస్తుంది. వివేక కుమార్తె ఆరోపణలు చేస్తే, టిడిపి పైన ఎదురు వైసీపీ అరొపణలు చేయటం, లోకేష్ సవాల్ విసరటం, ప్రమాణం చేయటం, వైసీపీ నేతలు ఎవరూ రాకపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇందులో ఒక టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే, ఆ రోజు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర రావు, సిబిఐకి రాసిన లేఖలు బయటకు రావటం. ఈ కేసుకి సంబంధించి, తన వద్ద చాలా సమాచారం ఉంది అంటూ, ఆయన సిబిఐకి లేఖ రాసారు. ఈ విషయంలో సిబిఐకి గతంలో రెండు సార్లు ఫోన్ చేసినా, తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పారు. వివేక కుటుంబ సభ్యులు అక్కడ స్పాట్ లో ఉండి ర-క్తం తుడవటం, కుట్లు వేయటం లాంటివి కూడా చెప్పారు. తరువాత విజయసాయి రెడ్డి, గుండె పోటు అని మీడియాకు చెప్పిన విషయం కూడా ఆ లేఖలో తెలిపారు. అయితే ఇవన్నీ వాస్తవాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వివేక కుటుంబం నుంచి, జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి ఏబి వెంకటేశ్వర రావుకి కౌంటర్ ఇవ్వాలి కానీ, ఎందుకో ఏపి పోలీసులు కౌంటర్ ఇచ్చారు.
ఈ రోజు డీజీపీ, ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపణల పై, ప్రెస్ మీట్ పెడతారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే డీజీపీ కాకుండా, డిఐజి మీడియా ముందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు ఖండించారు. ఏబీవీ దెగ్గర అంత సమాచారం ఉంటే, సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని, నేరం కూడా అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆరోపణలు వస్తుందే జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అయితే, మళ్ళీ జగన్ ప్రభుత్వానికే ఆధారాలు ఎలా ఇస్తారు ? అందుకే కదా ఆయన ఏడాది నుంచి సిబిఐకి రాస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, అప్పట్లో ఏబివి జగన్ కుటుంబ సభ్యుల పై ఆధారాలు లేకపోయినా, వాళ్లని అరెస్ట్ చేయాలని, దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఒత్తిడి తెచ్చారని, డిఐజి ఆరోపించారు. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్ లు అంటూ, ఆయన చేసిన ఆరోపణలు కూడా నిరాధారం అయినవి అని అన్నారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలు ఆయన మీడియాకు చెప్పటం కూడా తప్పు అని, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని అన్నారు. మరి దీని పై ఏబి వెంకటేశ్వర రావు ఎలా స్పందిస్తారో చూడాలి..