రాజకీయాల్లో ఉంటే, పక్క పార్టీ వాళ్ళని గౌరవించే రోజులు చూసిన వాళ్ళు, ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు అంటే ద్వేషం నింపే రాజకీయం చూసి అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ద్వేషుల వల్ల సమాజం విడిపోయింది. కేవలం ఇలా ద్వేషం నింపి, మన వర్గం, వేరే వర్గం అని చూస్తూనే, రాజకీయాల్లో మనుగడ ఉంటుంది అనుకుంటున్నారో ఏమో. ఇలాంటి రాజకీయం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. గత 20, 30 ఏళ్ళుగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చూసిన వారు, రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు పెద్ద శత్రువులు అనుకుంటున్నారు. వారి రాజకీయం అలా నడిచింది. కానీ ఎంత రాజకీయ వైరం ఉన్నా, ఇద్దరూ మనుషులుగానే ప్రవర్తించే వారు. చంద్రబాబు సహనం గురించి వేరే చెప్పేది ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి ఒకటి రెండు సార్లు మాటలు అదుపు తప్పినా, అసెంబ్లీ సాక్షిగా నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావ్ అని అన్నా, తరువాత తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పే వారు. చంద్రబాబుని వెన్నుపోటు దారుడు అన్నా, రాజశేఖర్ రెడ్డిని ఫ్యాక్షనిస్ట్ ని వీళ్ళు అన్నా, అది రాజకీయ విమర్శల వరుకే పరిమితం, వ్యక్తిగతంగా గౌరవించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం ద్వేషం మీదే నడుస్తుంది. ఆ ద్వేషం నింపటం ఎక్కడ వరకు వచ్చింది అంటే, చివరకు పుట్టిన రోజు నాడు కూడా, ఆ వ్యక్తి పై, సమాజంలో ద్వేషం నింపే ప్రయత్నం జరుగుతుంది.

reddy 20042021 2

ఇది చేసింది సాక్షాత్తు ఒక ఎంపీ. ఒక ఎంపీ ఈ దేశంలో ఎంతో గౌరవంగా ఉండాల్సిన వ్యక్తి, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పుట్టిన రోజు. తెలుగు జాతికి ఆయన సేవలు తలుచుకుంటూ, నలు మూలల నుంచి ఆయనకు విషెస్ చేస్తున్నారు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, మాజీ ప్రధానుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి కూడా తెలిపారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం, విషం నింపే ట్వీట్ వేస్తూ, చంద్రబాబుని 420తో సంబోధిస్తూ, హుందా తనం లేకుండా, మురికిగా ట్వీట్ చేసారు. నిజానికి చంద్రబాబు మీద ఒక్క 420 కేసు కూడా లేదు. విజయసాయి రెడ్డి అఫిడవిట్ చూసుకుంటే, ఆయన అఫిడవిట్ మొదటి పేజీలోనే మూడు 420 కేసులు ఉన్నాయి. ఇంకా 30 పేజీలు  మిగిలే ఉన్నాయి. చంద్రబాబు తిరిగి, ఇదే మాట అంటే, విజయసాయి రెడ్డి, మొఖం ఎక్కడ పెట్టుకుంటారు ? చంద్రబాబు అంటే ఇష్టం లేకపోతే, కాం గా ఉండవచ్చు కదా, ఇలా ఆయన పుట్టిన రోజు నాడు పై, ఈ విషం కక్కటం ఎందుకు ? ఆయన ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయారా ? ఇప్పటికైనా విజయసాయి రెడ్డి, ఇలాంటి పనులు మానుకోవాలని, కోరుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read