ఈ రోజు సత్యవేడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు. అయితే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. చివరకు రోజు కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. చంద్రబాబు బహిరంగ సభ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నిన్న రాళ్ల వర్షం.. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతతో చంద్రబాబు ఫైర్ అయ్యారు. "నేను వెళ్లిన చోట కరెంటు కట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు – నా సభలను ఎందుకు అడుగడుగునా అడ్డుకుంటున్నారు? – ఉన్మాదుల్లారా ఖబడ్దార్ - నా సభలో రాళ్లు వేస్తే దానికి నేనే ఆధారాలు ఇవ్వాలంట – వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు – ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ – అంబేడ్కర్ ఆశయాలను ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకున్నారు – పేదల కోసం బతికిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ - బాలయోగి, ప్రతిబాభారతికి పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ – వైసీపీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? - జగన్ తన కేసుల కోసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు – 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు – ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైలుకెళ్తాడని జగన్ భయం – కొత్త బ్రాండ్ల మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు - కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మద్యం షాపులు తురిచారు – టీచర్లను క్యూల దగ్గర కాపలా పెడతారా – కరోనా నియంత్రణ చేయలేని అసమర్థ సీఎం జగన్ – జగన్ ను చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు"
"నమ్ముకున్న వాళ్లను సీఎం పిడిగుద్దులు గుద్దుతున్నాడు – నా పోరాటం పదవి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం – సమైక్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2020 రూపొందించా – నవ్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2029 తయారు చేశా – శ్రీసిటీలోని 180 పరిశ్రమల్లో 90 మా పాలనలోనే వచ్చాయి – రూ. 4 వేల కోట్లతో హీరో మోటార్స్ తీసుకువచ్చాం – మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు – రైతు కూలీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది – సత్యవేడులో ఇసుక దొంగ వ్యాపారమే వైసీపీ కార్యకర్తలకు దినచర్య – నా సభలకు జనం స్పందన చూశాక భయం పట్టుకుంది – రాష్ట్ర విభజన కష్టాలున్నా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చా – ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు తప్ప పీఆర్సీ ఇవ్వలేదు – దోచుకొనేందుకు ఒక్కొక్కరికీ ఒక్కో ప్రాంతాన్ని పంచారు – చెప్పుకునేందుకు ఏమీలేకే వైసీపీ నేతలు సభలు పెట్టడం లేదు" అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రేపు ప్రచారం చివరి రోజు, సాయంత్రానికి ప్రచారం ముగియనుంది.