విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సిబిఐ మాజీ జేడీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, డిజ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అందులో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల సూత్రాల ప్రకారం తమ పరిధి పరిమితం అని చెప్పి వ్యాఖ్యానిస్తూనే, ఇందులో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరు అయితే ఉన్నారో, ఉద్యోగులు, నిర్వాసితులు, ఇతర వర్గాల వారు, ఇలా వాళ్ళ ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం పై మాత్రమే, దానికి సమాధానం ఇవ్వాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసారు. నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానాన్ని హైకోర్టులో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణను కూడా నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరుపున, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, హైదరాబాద్ కు చెందిన బాలాజీ , వీరు ఇద్దరూ, పిటీషనర్ తరుపున తమ వాదనలు వినిపించారు.
జేడీ లక్ష్మీనారాయణ పిటీషన్ పై, హైకోర్టు నోటీసులు...
Advertisements