జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యర్ధుల పై కేసులు పెడుతుంది అంటూ, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ఉంటాయి. చివరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసే, ముసలి వాళ్ళ పై కూడా సిఐడి కేసు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఇది కాస్త శ్రుతి మించి, చంద్రబాబు లాంటి పెద్ద స్థాయి నేతల పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే దాకా వ్యవహారం వచ్చింది. ఇప్పుడు చివరకు దేశ ద్రోహం కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పై, దేశ ద్రోహం ఆరోపణలు చేసారు. ఆయన్ను సస్పెండ్ కూడా చేసారు. ఆయన ఈ విషయం పై న్యాయ పోరాటం చేస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, మరో దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. చిత్తూర్ జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసారు. ఎవరైనా దేశ ద్రోహం అంటే, పక్క దేశాల వారికి మన దేశ రహస్యాలు చేరవేయటం, లేదా దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం లాంటివి అని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం, అది కాదు. గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ విషయంలో అయినా, జడ్జి రామకృష్ణ విషయంలో అయినా, ఎందుకు దేశ ద్రోహం కేసు పెట్టారో అర్ధం కావటం లేదు. కేవలం కక్ష సాధింపులో భాగం అనే ప్రతిపక్షాల మాటలకు బలం చేకురినట్టు అయ్యింది.

judge 16042021 2

ఇంతకీ ఆయన పై ఎందుకు కేసు పెట్టారో తెలుసు. కేవలం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినందుకు. ఒక టీవీ ఛానల్ డిబేట్ లో, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారని, ఎవరో కేసు పెడితే, దాన్ని పట్టుకుని, దేశ ద్రోహం కేసు పెట్టటంతో, ఆయన్ను అరెస్ట్ చేసారు. జడ్జి ముందు ప్రవేశపెట్టటంతో, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అమెరికా మానవ హక్కుల నివేదికలో, ఆంధ్రప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న అరాచకాల గురించి ప్రస్తావించిన విషయం పై, ఒక టీవీ ఛానల్ చర్చలో, జడ్జి రామకృష్ణ పాల్గున్నారు. ఆ చర్చలో జగన్ ని కంసుడితో పోల్చి, ఈ రక్షసడుని, రాక్షన పాలనను అంతం చేయటానికి, నేను కృష్ణుడిగా మారి, జగన్ ను శిక్షించాలని చూస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. దీనికి నొచ్చుకున్న జయరామచంద్రయ్య అనే వ్యక్తి, జడ్జి రామకృష్ణ పై కేసు పెట్టటంతో, ఆయన్ను అరెస్ట్ చేసారు. అయితే దీని పై స్పందించిన జడ్జి రామకృష్ణ, గతంలో చంద్రబాబుని నడి రోడ్డు పై కాల్చేయలని జగన్ చెప్పిన వ్యాఖ్యలు కంటే, నాది తప్పు ఏమి కాదని, జగన్ సర్వ నాశనం అయిపోతాడు అంటూ శాపనార్ధాలు పెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read