జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, దాఖలు అయిన పిటీషన్ పై, వైసీపీ శ్రేణులు షాక్ అయ్యే అప్దేడ్ చెప్పారు రఘురామకృష్ణం రాజు. ఇన్నాళ్ళు ఈ పిటీషన్ ని స్వీకరించరని, ఇప్పటికే సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది అంటూ, మొన్నటి దాకా రఘురామకృష్ణం రాజుని హేళన చేసిన వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారు, రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటీషన్ ని సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన ఈ కేసుని సిబిఐ కోర్టు విచారణ చేయనుంది. జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న 11 సిబిఐ చార్జ్ షీట్ ల రఘురామకృష్ణం రాజు తన బెయిల్ పిటీషన్ లో పొందు పరిచారు. ప్రతి చార్జ్ షీట్ లో జగన్ మోహన్ రెడ్డి ఏ1 గా ఉన్నారని, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ, తన సహా నిందితులకు వరుస పెట్టి పెద్ద పదవులు ఇస్తూ, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు అంటూ, సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. ప్రతి ఒక్కరూ బెయిల్ రద్దు చేస్తున్నాం అని బెదిరిస్తున్నారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా, మా ముఖ్యమంత్రికి, మా పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతోనే, తానూ ఈ పిటీషన్ వేసినట్టు రఘురామకృష్ణం రాజు చెప్పారు.

bail 15042021 2

సిబిఐ కోర్టు బెయిల్ పిటీషన్ విచారణకు తీసుకోవటం పై రఘురామకృష్ణం రాజు స్పందించారు. "సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశాం - ఈ నెల 22వ తేదిన కేసు విచారణకు రాబోతుంది - ఐఏఎస్ అధికారుల ఏసీర్ రిపోర్టును స్వయంగా ముఖ్యమంత్రి రాస్తా అనడం.. వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే - అధికారులను తన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తన కేసులో వారి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది - ఈ అంశంపై ప్రధానికి లేఖ రాశా.. త్వరలో పీఎంవో కార్యాలయం స్పందిస్తుందని భావిస్తున్నా - రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏపీలో అమలు కావడం లేదు - సీఎం జగన్ ఒక వ్యక్తితో నాపై కుక్క అని దూషణలు చేయించారు - నాకు సంస్కారం ఉంది కాబట్టి అవే మాటలు ముఖ్యమంత్రిని అనడం లేదు -జగన్ తొత్తులతో తిట్టిస్తే వారి మీదకు వెళ్లను, మీ మీదకే వస్తా - కొంతమంది సీబీఐ అధికారులకు ప్లాట్స్ కూడా కొనిస్తున్నారు - తిరుపతిలో 50 వేల మెజార్టీ కూడా వచ్చే పరిస్థితి లేదు - మేము చెప్పిన మెజార్టీ రాకపోతే గెలిచినా వేస్ట్ - సీఎం జగన్ తిరుపతి సభ పెట్టినా మెజార్టీ రాదు కాబట్టి సభ పెట్టడం లేదు - ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది" అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read