సిబిఐ చీఫ్ ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తిన పాయింట్ తో, కేంద్రం వెనకడుగు వేయాల్సి వచ్చింది. మొత్తంగా, ఈ పరిణామంతో సీబీఐ చీఫ్‍గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఢిల్లీలో టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు కానీ, రేపు కానీ వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మహరాష్ట్ర మాజీ డీజీపీగా పని చేసిన సుబోధ్ కుమార్ జైస్వాల్ , తదుపరి సిబిఐ చీఫ్ గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో, హైపవర్ సెలక్షన్ ప్యానెల్ సమావేశం జరిగింది. సుమారుగా 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని మోడీ, అలాగే ప్రతిపక్ష నేత ఈ సమావేశంలో పాల్గున్నారు. ఈ ముగ్గురూ పాల్గున్న ఈ సమావేశంలో దాదాపుగా మూడు పేర్లు ఈ సమావేశంలో ఖరారు చేసారు. అందులో నుంచి ఒక్కరికి అవకాసం లభించనుంది. మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్, రెండో పేరుగా డైరెక్టర్ జనరల్ సీమా బల్ కేఆర్ చంద్ర, అలాగే మూడు పేరుగా కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముదిని ప్రతిపాదించారు.

ramana 25052021 2

అయితే మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్ వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపే అవకాసం కనిపిస్తుంది. మొత్తంగా తదుపరి సిబిఐచీఫ్ కోసం,109 మంది అధికారుల పేర్లు పరిశీలించారు. వీరిని వడపోయిగా, మొత్తం 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ తరువాత నిన్న సమావేశం మొదలు అయ్యే సమయానికి, ఆరుగురుకి కుదించారు. అయితే ఈ ఆరుగురిలో, బీఎస్ఎప్ చీఫ్ రాకేశ్ ఆస్థానా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ చీఫ్ గా ఉన్న వైసీ మోదీ పేర్లు కూడా పరిశీలినలో ఉన్నాయి. వీరిలో రాకేశ్ అస్తానా వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముందు పెట్టారు. ఆరు నెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని, సిఐడి చీఫ్ గా నియమించవద్దు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని ఆ సమావేశం ముందు పెట్టారు. దీంతో, రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ పేర్లను, కేంద్రం పక్కన పెట్టాల్సి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read