ప్రసుత్తం రాష్ట్రంలో రాజకీయం కంటే, హాట్ టాపిక్ నెల్లూరు ఆ-నం-ద-య్య ఇస్తున్న క-రో-నా మం-దు. ఆయన ఇస్తున్న మం-దు-తో, క-రో-నా వచ్చిన వారికి నయం అవుతుందని, క్రిటికల్ కేసులు కూడా కోలుకుంటున్నారని, అలాగే క-రో-నా రాని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రం నలు మూలల నుంచే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడకు ఎగబడ్డారు. దీంతో ప్రభుత్వం దృష్టి ఆ మందు పై పడింది. అంత మంది అక్కడకు వస్తూ ఉండటంతో, ప్రభుత్వం రంగంలోకి దిగి, అసలు ఈ మం-దు ఏమిటి అంటూ తేల్చటం మొదలు పెట్టింది. ఈ మం-దు పై పరిశోధనలు జరిపి, దాని ఫలితాలు అనుకూలంగా వచ్చే దాకా, మం-దు ఇవ్వటం కుదరదు అంటూ ఆ-నం-ద-య్య పై ఆంక్షలు పెట్టారు. అంతే కాదు, ఆ-నం-ద-య్య-ను కొంత మంది వచ్చి తీసుకుని వెళ్లారని, ఆయన కొంత మంది అధీనంలో ఉన్నారని, కొంత మంది ప్రముఖులు ఆయన చేత మం-దు తయారు చేపించి, బయటకు పంపిస్తున్నారు అంటూ, రెండు రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే మరో పక్క ప్రభుత్వం మాత్రం, దీని పై వివిధ రకాల పరిశోధనలు జరుపుతున్నాం అని చెప్తుంది. అయితే గత వారం రోజులుగా మం-దు ఆగిపోవటం, అనిశ్చితి నేలకోనటంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సొంత జిల్లా నెల్లూరు కావటంతో, ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ-నం-ద-య్య మం-దు పై ప్రయోగాలు, పరిశోధనలు ఎంత వరకు వచ్చాయి, అసలు ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు పరిశోధనలు జరుగుతాయి, వాటి ఫలితాలు ఎప్పుడు చెప్తారు, ఈ మం-దు పై ప్రభుత్వ పరంగా వచ్చిన నివేదిక ఏమిటి, డాక్టర్లు ఏమి అంటున్నారు, ఇలా తదితర అంశాల పై, ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆరా తీసారు. ఢిల్లీలోని కేంద్రమంత్రులతో ఆయన ఈ విషయం పై సమాచారం తెప్పించుకున్నూర్. ముఖ్యంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని, ఈ పరిశోధనల పై సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తో కూడా ఈ మం-దు పై, దాని ప్రభావం పై ఆరా తీసారు. అయితే జరుగుతున్న పరిశోధనల పై చెప్పగా, ఈ పరిశోధనలు తొందరగా ముగించి, తగు నివేదికలు తొందరగా ఇవ్వాలని కోరారు. ఇక మరో పక్క, ఈ రోజు ఉదయం హైకోర్టులో కూడా ఈ విషయం పై విచారణ జరగగా, హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.