బిసి జనార్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు పై ఈ రోజు టిడిపి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, కొంత మంది పోలీసులు తీరు పై నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే "ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్నోళ్ళు అందరూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, జైలుకు పోయి వచ్చారు, మళ్ళీ పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా దానికి సిద్ధంగా ఉంటే మీరు చేయండి. తమాషా ఆటలు ఆడొద్దు అండి రాజకీయాల్లో. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీరు చేసే పనులు శాశ్వతం. రికార్డులో ఉంటాయి. మీరు తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చేసినటువంటి దౌ-ర్జ-న్యా-ల-కు వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు వస్తుంది. గుర్తు పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థను కూడా హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దు అండి మీరు. రెండేళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంకో మూడేళ్ళు అవుతుంది. ఆ రోజు మీకు ఎవరు వస్తారో చూస్తాను. ఏదో తెలుగు దేశం పార్టీ పైన దా-డు-లు చేస్తే, హిం-స చేస్తే, కార్యకర్తలు చల్లా చెదురు అయిపోతారు అనుకుంటున్నారు కాని, మీ వల్ల కాదు ఇది. తమాషా అనుకోవద్దు అండి. ప్రతి ఒక్క దానికి రెట్టింపు కసితో పని చేస్తాం. ఈ రాష్ట్రం కోసం పని చేస్తాం. ఈ ఉ-న్మా-దు-ల నుంచి కాపాడటానికి పని చేస్తాం. అంతే కాని, మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలి అనుకుంటే మాత్రం, మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఎప్పుడు వీరిని అరెస్ట్ చేసారు ?ఎక్కడ ఉన్నారు వీళ్ళు ? పోలీసులు అరెస్టు చేసిన వారిని 24 గంటల లోపు ఎందుకు జుడీషియల్ ముందు ప్రవేశ పెట్టలేదు ? అడిగే వారు లేరనా ? "

cb n26205 2021 2

"ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అనేక టెక్నాలజీ మార్పులు తీసుకుని వచ్చి, బాడీకి వొర్న్ కెమెరాలు పెట్టాం. పోలీసులు ఎవరైనా మాట్లాడినా, పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడినా అన్నీ రికార్డు చేసి పారదర్శకత తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఎవరినీ లోనికి రానీకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే, నేను ఒకటే చెప్తున్నా. మనం కూడా ధైర్యంగా ఉండాలి. మన ప్రాణం ఎంత ముఖ్యమో, వాళ్ళ ప్రాణం కూడా వారికి అంతే ముఖ్యం. 24 గంటలు పోలీసులని పెట్టుకుని తిరగలేరు. లేకపోతే ఇదే మాదిరిగా రెచ్చిపోతే, మనకు కూడా రోషం ఉంటుంది. పౌరుషం ఉంటుంది. రెండు పక్షాలను సమానంగా చూసినప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుంది. ఏకపక్షంగా మీరు చేస్తే, ఎవరైతే దె-బ్బ తిన్నారో, వాళ్ళలో ఆ బాధ, తపన, ప్ర-తీ-కా-రం శాశ్వతంగా ఉంటుంది. జనార్ధన్ రెడ్డి అంశంలోను పార్టీ ప్రైవేటు కేసు వేస్తుంది. మొత్తం రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తాం. పోలీసులు చట్ట ప్రకారం పని చేయకపొతే మాత్రం, వారిని చట్ట ప్రకారం శిక్షించే వరకు వదిలి పెట్టం అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది."

Advertisements

Advertisements

Latest Articles

Most Read