కో-వి-డ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని, ప్రభుత్వయంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గతంలోచెప్పిన పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ ఫార్మాలా ప్రకారమే పనిచేస్తోంది తప్ప, ప్రజల ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యు లు నిమ్మలరామానాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "రాష్ట్రం ఇప్పటికే క-రో-నా ప్రదేశ్ గా మారింది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుతుంటే, ఏపీలో మాత్రం ఆజాడలు ఎక్కడా కనిపించడంలేదు. క-రో-నా-ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమ నే వాస్తవాన్ని ప్రభుత్వం త్వరగా గ్రహించాలి. అనేక దేశాలు క-రో-నా రెండో దశ నుంచి విజయవంతంగా బయటపడటానికి కారణం ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించడమే. ఏపీ ముఖ్యమంత్రి అసమర్థత, చేతగానితనం కారణంగా రాష్ట్రం వ్యాక్సిన్లు కొనుగోలుచేయలేని దుస్థితికి చేరింది. కేంద్రం ఉచితంగా సరఫరాచేసే వ్యాక్సిన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడితే ప్రజలు ప్రాణాలు నిలుస్తాయా? అందుకే ప్రజలంతా వ్యాక్సిన్ కు దూరమై, కో-వి-డ్ కు దగ్గరవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ లో జగన్ ప్రభుత్వ వైఫ్యలం అడుగడుగునా కనిపిస్తోంది. వ్యాక్సిన్లు కొనకుండా మొద్దు నిద్ర పోయిన ప్రభుత్వం, కేంద్రానికి లేఖలు రాస్తూ కూర్చుంది. కేంద్రానికి లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా లేక వ్యాక్సిన్ తయారీ సంస్థలతో మాట్లాడి, వారికి అడ్వాన్స్ లు చెల్లిస్తే, వ్యాక్సిన్లు అందుతాయా అనేది కూడా ముఖ్యమంత్రికి తెలియడంలేదా? లేఖలతో వ్యాక్సిన్లు రావని తెలిసి కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలను మోసగిస్తున్నాడో వారికి సమాధానం చెప్పాలి. నిన్నకూడా ముఖ్యమంత్రి కేంద్రానికి ఒక లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డిపై, ప్రభుత్వంపై వచ్చే ప్రజా వ్యతిరేకతను ప్రైవేట్ ఆసుపత్రులపైకి మరల్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నిన్న ప్రధానికి లేఖరాసినట్టుగా ఉంది. తన అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ లేఖ రాశాడని దాన్నిచూస్తేనే అర్థమవుతోంది.

ప్రైవేట్ ఆసుపత్రులు వారు వ్యాక్సిన్లకు అధిక ధరలు వసూలు చేస్తాడని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. నిన్నటివరకు వ్యాక్సిన్ పంపిణీ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలోనేఉంది..తామేమీచేయలేమని చెప్పుకున్న ముఖ్యమంత్రి, నేడు తన చేతగానితనాన్ని కేంద్రానికి లేఖ రాయడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులపై నెట్టే ప్రయత్నం చేశాడు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి లేఖరాయడం నిజంగా ఆయన అసమర్థతకు సంకేతం. గతంలో కేంద్రమిచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి 5శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోలులో కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలకు ఇచ్చిన 45శాతం కోటా ప్రకారం జగన్ ప్రభుత్వం తయారీదారుల నుంచి సకాలంలో ఎందుకు వ్యాక్సిన్లు కొనలేకపోయింది? వ్యాక్సిన్ తయారీ కంపెనీలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ఏప్రియల్ లో విడుదల చేసిన మీడియా సమాచారంలో చాలా స్పష్టంగా తాము తయారుచేసే వ్యాక్సిన్లలో 50శాతం కేంద్రానికి కేటాయిస్తున్నామని చెప్పడం జరిగింది. మిగిలిన 50శాతంలో 5శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు, 45శాతం వాటాను రాష్ట్రాలకు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. తయారీసంస్థలు ఆ విషయం చెప్పగానే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక వంటి అనేకరాష్ట్రాలు వెంటనే స్పందించి, వ్యాక్సిన్ల కొనుగోలు కు తయారీ కంపెనీలకు ఆర్డర్లుపెట్టడం జరిగింది. 45శాతం వాటాను అందుకోవడానికి పోటీపడిన మహారాష్ట్ర 12 కోట్లకు, తమిళనాడు కోటి 50లక్షలు, కేరళ 70లక్షల వ్యాక్సిన్లకు, కర్ణాటక కోటి వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టడం జరిగింది. అనేక రాష్ట్రా లు కోటినుంచి పది కోట్ల వరకు వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టి, అడ్వాన్సులుచెల్లిస్తే, ఏపీ మాత్రం, ఎక్కడా ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్ సంస్థలకు చెల్లించడంగానీ, ఆర్డర్లు పెట్టడం గానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ తయారీసంస్థలతో మాట్లాడకుండా, వాటికి డబ్బులుచె ల్లించకుండా కేంద్రానికి లేఖలురాస్తూ కాలయాపనచేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read