ఓటుకు నోటు, ఓటుకు నోటు అంటూ చంద్రబాబు పై గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఒక పక్క లక్ష కోట్ల దొంగలు దర్జాగా తిరుగుతుంటే, 50 లక్షల ఆరోపణల పై చంద్రబాబు ఓటు కోసం నోటు ఇచ్చారు అంటూ ఆరోపణలు చేసారు. అసలు మనాకు ఓటుకు నోటు అంటే ఏంటో తెలియనట్టు, అసలు అవి ఎప్పుడూ చేయనట్టు, కొంత మంది బిల్డ్ అప్ ఇస్తూ వచ్చారు. అయినా అక్కడ చంద్రబాబు వాయిస్ నిజమో కాదో ఇప్పటికీ తెలియదు. ఒక వేళ నిజం అయినా, అక్కడ చంద్రబాబు డబ్బు ప్రస్తావన ఏమి చేయలేదు. అదీ కాక అక్కడ వేరే పార్టీ ఎమ్మెల్సీతో కాదు మాట్లాడింది. అక్కడ ఉన్నది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ. ఎవరైనా వారితో మాట్లాడవచ్చు. మాకు ఓటు వేయమని అడగవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు అసలు ఆ మాటలు అన్నారో లేదో పక్కద పెడితే, ఇదేదో పెద్ద నేరం అయినట్టు, ఇన్నాళ్ళు వైసీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్న బ్లూ బ్యాచ్ కి షాక్ ఇచ్చింది ఈడీ, ఏసిబి. అసలు ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయలేదు ఏసిబి. ఏసిబి చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఎక్కడ లేదు. ఈడీ కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ వేసింది. అందులో కూడా ఎక్కడా చంద్రబాబు పేరు లేదు.
అయితే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు తమ చార్జ్ షీట్ లో ఈడీ పెట్టింది. అయితే మనీ లాండరింగ్ విషయంలో, రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనే దాని పై, ఈడీ రేవంత్ రెడ్డిని చేర్చింది. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అనే విషయంలో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసారు. అయితే ఇక్కడ ఏసిబి, ఈడీ చార్జ్ షీట్ లు , రెండిటిలో ఎక్కడా చంద్రబాబు పేరు అయితే లేదు. ఆయన పై ఆధారాలు కోసం ఎంతగా ప్రయత్నం చేసినా, చంద్రబాబు పై ఎలాంటి ఆధారాలు దొరక్క పోవటంతో, చంద్రబాబు పై ఇన్నాళ్ళు విషం చిమ్మిన బ్లూ బ్యాచ్ కు నిరాస అనే చెప్పాలి. గత 40 ఏళ్ళుగా చంద్రబాబు పై దాదాపుగా 40 కేసులు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి వరకు, అనేక మంది అయన పై ఎన్నో ఆరోపణలు, కేసులు పెట్టి ఇరికిద్దాం అని చూసినా, ప్రతి కేసులో కూడా ఆయన పై ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా ఎవరూ చూపించలేక పోయారు. దీంతో, అన్ని ఆరోపణలు లాగే ఇది కూడా కేవలం రాజకీయ ఆరోపణలు లాగే అయిపోయాయి.